నైరుతి ఆలస్యమవుతుందా..!

నేడు కేరళ తీరాన్ని తాకుతాయని భావించిన నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం కేరళను తాకుతాయనే అంచనాలు మారిపోయాయి. ఈ నెల 8 నాటికి కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది. భూమధ్య రేఖ ప్రాంతంలో గాలులు మందగించడంతో రుతుపవనాలు కదలికలు తగ్గి వాటి గమనం మందగిస్తోందన్నారు. ఇక కేరళకు రుతుపవనాలు 8కి వస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోకి 13న వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకుడు వై.కె.రెడ్డి తెలిపారు.

నైరుతి ఆలస్యమవుతుందా..!

Updated on: Jun 06, 2019 | 7:57 AM