అంతర్జాతీయ క్రికెట్ నుంచి సౌతాఫ్రికా అవుట్..?

త్వరలో క్రికెట్‌ సౌతాఫ్రికా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగనుందా.. ?. సీఎస్ఏలో ప్రభుత్వం జోక్యాన్ని ఐసీసీ వ్యతిరేకిస్తుందా..? తాజా పరిణామాలను చూస్తుంటే అవుననిపిస్తుంది.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి సౌతాఫ్రికా అవుట్..?
Follow us

|

Updated on: Oct 15, 2020 | 6:26 AM

త్వరలో క్రికెట్‌ సౌతాఫ్రికా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగనుందా.. ?. సీఎస్ఏలో ప్రభుత్వం జోక్యాన్ని ఐసీసీ వ్యతిరేకిస్తుందా..? తాజా పరిణామాలను చూస్తుంటే అవుననిపిస్తుంది. సౌతాఫ్రికా క్రికెట్ పై బహిష్కరణ కత్తి వేలాడుతోంది. క్రికెట్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకోనున్నట్టు ఆ దేశ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీఎస్ఏపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఐసీసీ నిబంధనల ప్రకారం సభ్య దేశాల క్రికెట్‌ వ్యవహారాల్లో ఆయా ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు. అలా జరిగితే ఆ క్రికెట్‌ బోర్డును ఐసీసీ అంతర్జాతీయ పోటీల నుంచి బహిష్కరిస్తుంది. అవినీతి ఆరోపణలతో గత ఆగస్టులో సీఎస్ఏ సీఈవోతో సహా పలువురు బోర్డు సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక సీఎస్ఏలో అవినీతి జరిగినట్టు ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ నిర్ధారించింది. దీంతో క్రికెట్ సౌతాఫ్రికాపై చర్యలు తీసుకొనేందుకు సౌతాఫ్రికా ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరోవైపు.. సీఎస్ఏ డైరెక్టర్లంతా మూకుమ్మడిగా రాజీనామా చేయాలని సౌతాఫ్రికా క్రికెటర్ల సంఘం డిమాండ్‌ చేసింది.