సోనూ సూద్‌ను కొడితే ఆ స్టార్ హీరోని జనాలు శపిస్తారట.. ఈ మాట చెప్పింది మరెవరో కాదు. స్వయంగా ఆయనే..
తాజాగా సోనూసూద్, చిరంజీవిల మధ్య జరిగిన ఓ ఆసక్తికరమైన సంభాషణ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఆచార్య చిత్రంలో సోనూసూద్‌ను చిరంజీవి కొట్టే సన్నివేశం ఒకటి ఉంటుందట.. ఈ సీన్ చేసే సమయంలో చిరు సోనూసూద్‌తో మాట్లాడుతూ..
sonu sood about acharya movie: లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది వలస కార్మికులకు, పేద ప్రజలకు సహాయాన్ని అందించి సోనూసూద్ ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించాడు. ట్విట్టర్ వేదికగా ఎవరు ఏ సాయం అడిగినా సరే వెంటనే లేదనకుండా అందించి కలియుగ కర్ణుడిగా పేరు సంపాదించుకున్నాడు సోనూసూద్. దీంతో సోనూను ప్రజలంతా హీరో అంటూ పొగిడారు. ఇక మరి కొంత మంది అయితే సినిమాలో హీరోలుగా నటించే వారి చేయనిది.. విలన్‌గా కనిపించే సోనూసూద్ చేస్తున్నాడని కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే సోనూసూద్ ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రంలో విలన్ రోల్‌లో నటిస్తున్నాడు. తాజాగా సోనూసూద్, చిరంజీవిల మధ్య జరిగిన ఓ ఆసక్తికరమైన సంభాషణ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఆచార్య చిత్రంలో సోనూసూద్‌ను చిరంజీవి కొట్టే సన్నివేశం ఒకటి ఉంటుందట.. ఈ సీన్ చేసే సమయంలో చిరు సోనూసూద్‌తో మాట్లాడుతూ.. ‘మీరు ఈ సినిమాలో ఉండడం పెద్ద సమస్యగా మారింది. మిమ్మల్ని కొడితే ప్రజలు నన్ను శపిస్తారు’ అని చిరు చెప్పాడంటూ సోనూ చెప్పుకొచ్చాడు. ఈ లెక్కన చూస్తుంటే భవిష్యత్తులో సోనూ సూద్‌కు విలన్ పాత్రలు రావేమోననే సందేహం కలుగుతోంది కదూ.