తన బయోపిక్‌పై స్పందించిన షకీలా.. చదువుకుంటున్న అమ్మాయిలు, హీరోయిన్లు తనలా మోసపోవద్దని సూచన.

ప్రముఖ శృంగార తార షకీలా జీవిత కథ ఆధరంగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘షకీలా’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో షకీలా మీడియాతో ముచ్చటించింది.

తన బయోపిక్‌పై స్పందించిన షకీలా.. చదువుకుంటున్న అమ్మాయిలు, హీరోయిన్లు తనలా మోసపోవద్దని సూచన.
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 20, 2020 | 6:33 PM

shakeela about her biopic: ప్రముఖ శృంగార తార షకీలా జీవిత కథ ఆధరంగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘షకీలా’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. షకీలా పాత్రలో రిచా చద్దా నటిస్తుండగా ఈ చిత్రానికి ఇంద్రజీత్ లంకేష్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో షకీలా మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్బంగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ.. తాను బతికి ఉండగానే తన బయోపిక్ తెరకెక్కడం ఆనందంగా ఉందని తెలిపింది. రిచా చద్దా తన పాత్రలో బాగా నటించందని షకీలా కొనియాడింది. ఇక ప్రతి ఒక్కరికీ ఎన్నో బాధలుంటాయని.. తాను గౌరవాన్ని కానీ, సానుభూతిని కానీ కోరుకోవడం చెప్పిన షకీలా.. తనకు దక్కాల్సిన గౌరవం మాత్రం దక్కలేనది వాపోయింది. ‘నా వెకున నా గురించి మాట్లాడే వారి గురించి నేను బాధపడతను. నా ముఖం మీద విమర్శించే ధైర్యం ఎవరికీ లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా ద్వారా సినీ పరిశ్రమలో ఉన్న హీరోయిన్స్, చదువుకుంటున్న అమ్మాయిలకు.. ‘నేను మోసపోయినట్లు ఎవరూ మోసపోకండి’ అని షకీలా సూచించింది. మరి షకీలా చిత్రం వెండితెరపై ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి.