నిద్రపోతున్న కొడుకును నరికి చంపిన తండ్రి
తాగిన మత్తులో వేధింపులకు పాల్పడుతున్న కన్నకొడుకును నరికి చంపాడు ఓ కసాయి తండ్రి. నిద్ర పోతున్న కొడుకును గొడ్డలితో అతిదారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

తాగిన మత్తులో వేధింపులకు పాల్పడుతున్న కన్నకొడుకును నరికి చంపాడు ఓ కసాయి తండ్రి. నిద్ర పోతున్న కొడుకును గొడ్డలితో అతిదారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ధర్మపురి మండలం జైన గ్రామంలోని గుడ్ల సత్యనారాయణ(38) మధ్యాహ్నం సమయంలో ఇంట్లో నిద్రిస్తున్నాడు. అదే సమయంలో తండ్రి పోచరాజయ్య ఇంటికి చేరుకునయ్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తండ్రి పోచరాజయ్య గొడ్డలితో కుమారుడిని నరకాడు. దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఫిబ్రవరిలో ఇరాక్ నుంచి వచ్చిన సత్యనారాయణ ఏపని చేయకుండా గ్రామంలో తిరుగుతున్నాడు. పైగా నిత్యం తాగి వస్తూ కుటుంబసభ్యులతో గొడవ చేస్తున్నాడు. అతని వేధింపులు భరించలేక పోయిన తండ్రి కొడుకు ను హంతమోదించాలనుకున్నాడు. ఇదే క్రమంలో మద్యం మత్తులో ఉన్న తండ్రి కుమారుడిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహన్ని పోస్టుమార్టం నిమ్మితం ధర్మపురి ఆస్పత్రికి తరలించారు. పోచరాజయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




