త‌ల్లికి పిండం పెడుతూ..కరోనాతో కుమారుడు మృతి

పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తల్లికి పిండం పెడుతూ కుమారుడు ప్రాణాలు విడిచాడు.

త‌ల్లికి పిండం పెడుతూ..కరోనాతో కుమారుడు మృతి

Updated on: Jul 26, 2020 | 8:30 PM

పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తల్లికి పిండం పెడుతూ కుమారుడు ప్రాణాలు విడిచాడు. అత‌డు చ‌నిపోయింది క‌రోనాతో కావ‌డం విస్మ‌య‌ప‌రిచే అంశం. ఎస్సై జానా సతీష్‌ తెలిపిన వివరాల ప్రకారం…గ్రామానికి చెందిన ఎం.శ్రీనివాస్‌ తల్లి 11 రోజుల క్రితం ప్రాణాలు విడిచింది. శనివారం వారి బంధువులు, కుమారుడు తల్లికి పెద్ద క‌ర్మ కార్యక్ర‌మం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. పిండం పెడుతూ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే చ‌నిపోయాడు శ్రీనివాస్‌. వెంటనే కుటుంబ స‌భ్యులు వైద్యాధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి మృతదేహానికి కరోనా ప‌రీక్ష‌లు చేయ‌గా.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

దీంతో అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌యిన‌వారంతా షాక్ కు గుర‌య్యారు. దీంతో గ్రామస్తులు ఎవ్వరూ శ్రీనివాస్ మృతదేహాన్ని ఖ‌ననం చేయ‌డానికి సాహ‌సించ‌లేదు. దీంతో కుటుంబ సభ్యులు నలుగురు గ్లౌజ్‌లు ధరించి మాస్కులు పెట్టుకుని అంత్యక్రియలు ముగించారు. వారికి కరోనా పరీక్ష‌లు చేస్తామ‌ని అధికారులు తెలిపారు.

ఇది కూడా చ‌ద‌వండి : కుమార్తెల‌తో కాడి మోయిస్తూ రైతు వ్య‌వ‌సాయం..చ‌లించిపోయిన సోనూసూద్..