రాజధాని నగరం హైదరాబాద్‌లోని ఇంకా పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మేడ్చల్ ప్రాంతం ఇంకా నీటిలోనే మగ్గుతోంది. మల్కాజ్‌గిరి జిల్లా ప్రగతి నగర్, సుమా రెసిడెన్సి కాలనీ.. వరద బురద నుండి ఇంకా తేరుకోలేదు. రామంతపూర్ రవీంద్ర నగర్ కాలనీలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురదనీరు నిల్వఉండి నాలుగురోజులు కావడంతో వరద బురదతో కాలనీలు కంపుకొడుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో ప్రగతి నగర్ కాలనీ సుమా రెసిడెన్సి ప్రాంతాల్లో అదనపు పైప్ లైన్ లతో నీటిని తరలిస్తున్నారు. దీంతో సుమా రెసిడెన్సీ వాసులు కొద్దిగా ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఇప్పటి వరకు ఏ అధికారి తమ వద్దకు వచ్చి పలకరించలేదని సదరు కాలనీల వాసులు మండిపడుతున్నారు.