పానుగంటి శ్రీధర్ డెత్ మిస్టరీ.. నిద్రలోనే చనిపోయారంటూ అమెరికా పోస్ట్ మార్టమ్ రిపోర్ట్

|

Dec 04, 2020 | 1:54 AM

అమెరికా న్యూయార్క్‌లో ఉద్యోగం చేస్తున్న హైదరాబాద్‌ వాసి పానుగంటి శ్రీధర్‌ నిద్రలోనే కన్నుమూశాడు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అతని మృతికి సంబంధించి..

పానుగంటి శ్రీధర్ డెత్ మిస్టరీ.. నిద్రలోనే చనిపోయారంటూ అమెరికా పోస్ట్ మార్టమ్ రిపోర్ట్
Follow us on

అమెరికా న్యూయార్క్‌లో ఉద్యోగం చేస్తున్న హైదరాబాద్‌ వాసి పానుగంటి శ్రీధర్‌ నిద్రలోనే కన్నుమూశారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అతని మృతికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. అన్ని పరీక్షలు పూర్తయి రిపోర్టు రావడానికి చాలా సమయం పడుతుందని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. శ్రీధర్‌ మృత దేహం స్వదేశానికి రావాలంటే ఆరు నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. వీలైనంత త్వరగా తీసుకువచ్చేందుకు సహాయం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు ఆయన కుటుంబ సభ్యులు.