Krishna District: పండక్కి ఊరొచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. క్రికెట్ ఆడటానికి వెళ్లాడు.. పాపం

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. కౌతవరం హైస్కూల్‌లో బుధవారం క్రికెట్ పోటీ ఉండడంతో స్నేహితులతో కలిసి వెళ్లాడు. కాసేపు ఆడిన అనంతరం ఛాతీ నొప్పితో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు సీపీఆర్ చేయగా కాస్త స్పృహలోకి వచ్చాడు. కానీ...

Krishna District: పండక్కి ఊరొచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. క్రికెట్ ఆడటానికి వెళ్లాడు.. పాపం
Sai Kumar
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 26, 2024 | 11:31 AM

మాయదారి గుండెపోటు మహమ్మారిలా మారింది. వయసుతో సంబంధం లేకుండా పసివాళ్లనుంచి వృద్ధుల వరకూ అందరిపైనా పంజా విసురుతోంది. అప్పటి వరకూ ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ ఉన్నవారినే టార్గెట్‌గా చేసుకొని నిర్దాక్షిణ్యంగా ఉసురు తీసేస్తోంది. కరోనా మహమ్మారి వెళ్తూ వెళ్తూ తన బాధ్యతను గుండెపోటుకు అప్పగించిందా అనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే. తాజాగా ఓ యువకుడు క్రిస్మస్‌ సెలవులకు ఇంటికొచ్చి స్నేహితులతో క్రికెట్‌ ఆడుతూ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది.

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. అంగలూరుకు చెందిన కొమ్మాలపాటి సాయికుమార్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. క్రిస్మస్ సెలవు రావడంతో ఆదివారం సొంతూరుకు వచ్చాడు. బుధవారం కౌతవరం హైస్కూల్‌లో క్రికెట్ పోటీలు ఉండడంతో స్నేహితులతో కలిసి వెళ్లాడు. కాసేపు ఆడిన తర్వాత ఛాతీలో నొప్పిగా అనిపించడంతో కూర్చుండిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు స్నేహితులు సిద్ధం కాగా, గ్యాస్ నొప్పి అనుకుని నీళ్లు తాగాడు. అలసట తగ్గాక మళ్లీ క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన స్నేహితులు సీపీఆర్ చేయడంతో స్పృహలోకి వచ్చాడు. ఆ వెంటనే వారు అతడిని గుడ్లవల్లేరులోని ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు ఆపరేషన్ థియేటర్లో ఉండటంతో మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ సాయికుమార్‌ను పరిశీలించిన వైద్యులు గుడివాడ తీసుకెళ్లాలని సూచించారు. గుడివాడ తీసుకెళ్లాక పరీక్షలు చేసిన వైద్యులు సాయికుమార్ అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..