‘పెళ్లికొచ్చిన చిన్నది, చీరలోనే పామును పట్టేసింది’ !

తమ బంధువుల పెళ్ళికి ఎంచక్కా చీరలో ముస్తాబై వచ్చింది ఆమె . అంతా పెళ్లి హడావుడిలో  ఉండగా ఎక్కడినుంచీ వచ్చిందోగానీ ఓ పాము వఛ్చి పెళ్ళివారి వంటింట్లో దూరింది. ..

'పెళ్లికొచ్చిన చిన్నది, చీరలోనే పామును పట్టేసింది' !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 16, 2020 | 10:28 AM

తమ బంధువుల పెళ్ళికి ఎంచక్కా చీరలో ముస్తాబై వచ్చింది ఆమె . అంతా పెళ్లి హడావుడిలో  ఉండగా ఎక్కడినుంచీ వచ్చిందోగానీ ఓ పాము వఛ్చి పెళ్ళివారి వంటింట్లో దూరింది. .. వంటింటి సామాన్ల మధ్య దూరిపోయింది. అది చూసి అంతా భయంతో పరుగులు తీసినా ఆ మహిళ మాత్రం అది ఎక్కడ దాక్కుందో ఇట్టే కనిపెట్టి, ఆట్టే..వట్టి చేతుల్తో పట్టేసింది. ఏ మాత్రం భయం లేకుండా ధైర్యంగా దాన్ని బయటకు తీసుకువెళ్లి ఓ బట్టలో ‘బంధించింది’.. ఆవిడ స్నేక్ క్యాచరా అంటే కానే కాదు.. కానీ ఎంతో నేర్పుగా అనుభవజ్ఞురాలైనస్నేక్ క్యాచర్ మాదిరే కోబ్రాను పట్టేయడం విశేషం. ఆమె సాహసాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. కర్ణాటకలో ఆ మధ్య జరిగిన ఈ అపర ‘నాగిని’ ఉదంతం తాలూకు వీడియో వైరల్ అయింది. అన్నట్టు ఆ ‘నాగిని’ పేరు నిర్జారా చిట్టి అట ! పేరేదైతేనేం ?