బహిరంగ ధూమపానానికి తప్పదిక భారీ జరిమానా..

సినిమా హాళ్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు.. ఇలా ఒకటేమిటి అన్ని చోట్లా కూడా నో స్మోకింగ్ బోర్డులు దర్శనమిస్తుంటాయి. అంతేకాకుండా సినిమాల్లో అయితే ‘పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం’ అంటూ ముందు ముకేశ్ యాడ్ వస్తుండటం ఆనవాయితీ. అయితే ఇవన్నీ చూడడానికి మాత్రమే తప్పితే.. ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోరు. ఇష్టమొచ్చినట్లుగా ఎక్కడ పడితే అక్కడ సిగరెట్లు తాగుతుంటారు. పోలీసులు సైతం ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించినా.. పబ్లిక్‌లో స్మోకింగ్‌ చేస్తున్న వాళ్ళం […]

బహిరంగ ధూమపానానికి తప్పదిక భారీ జరిమానా..
Ravi Kiran

| Edited By:

Dec 14, 2019 | 10:23 AM

సినిమా హాళ్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు.. ఇలా ఒకటేమిటి అన్ని చోట్లా కూడా నో స్మోకింగ్ బోర్డులు దర్శనమిస్తుంటాయి. అంతేకాకుండా సినిమాల్లో అయితే ‘పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం’ అంటూ ముందు ముకేశ్ యాడ్ వస్తుండటం ఆనవాయితీ. అయితే ఇవన్నీ చూడడానికి మాత్రమే తప్పితే.. ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోరు. ఇష్టమొచ్చినట్లుగా ఎక్కడ పడితే అక్కడ సిగరెట్లు తాగుతుంటారు. పోలీసులు సైతం ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించినా.. పబ్లిక్‌లో స్మోకింగ్‌ చేస్తున్న వాళ్ళం రోజూ చూస్తూనే ఉంటాం. తాజాగా రోడ్డుపై సిగరెట్ తాగుతున్న ఒకడిని.. అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు పట్టించగా.. వారు అతడ్ని కోర్టులో హాజరు పరిచారు. ఇక కోర్టు అతడికి వేసిన శిక్ష ఊహించని రీతిలో ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మద్యపానం, ధూమపానం బహిరంగ ప్రదేశాల్లో నిషేధం ఇది అందరికి తెలిసిన సంగతే. అయితే ఈ విషయాన్ని కూడా మర్చిపోయి.. మేడిపల్లి ఎన్‌ఐఎన్ కాలనీకి చెందిన బాలదీపక్ బుధవారం నైట్ దర్జాగా పబ్లిక్‌లో స్మోకింగ్ చేస్తున్నాడు. అది చూసిన చుట్టుపక్కల వాళ్ళు పెట్రోలింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక వారు అతన్ని అరెస్ట్ చేసి.. ఎల్‌బీ నగర్ ఫస్ట్ క్లాస్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరు పరిచారు. ఇక కోర్టు అతనికి ఊహించని విధంగా మూడు రోజుల జైలు శిక్ష విధించింది. గతంలో పబ్లిక్ స్మోకింగ్ చేసినవాళ్లకు కోర్టు రూ.50 రూపాయల ఫైన్ విధించేది. ఇకపోతే బహిరంగ ధూమపానానికి జైలు శిక్ష పడటం ఇదే తొలిసారి కావడం విశేషం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu