
అభిమానుల ప్రార్థనలకు, డాక్టర్ల కృషికి ఫలితం దక్కినట్లే కనిపిస్తుంది. కరోనాతో తీవ్ర అస్వస్థతకు గురై అత్యవసర చికిత్స అందుకుంటున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ సాయం లేకుండానే శ్వాస తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఎస్సీబీ సోదరి ఎస్సీ శైలజ తెలిపారు. ఈ మేరకు ఆమె ఆడియో టేప్ విడుదల చేశారు.
”నమస్కారమండీ.. అన్నయ్య ఆరోగ్యం రోజురోజుకూ మెరుగవుతోంది. డాక్టర్ల ట్రీట్మెంట్‌కు ఆయన రెస్పాండ్ అవుతున్నారు. ఇది సంతోషించాల్సిన విషయం. ప్రజంట్ ఆయనకు ఉంచిన వెంటిలేటర్ తొలగించారు. మిగిలినవి కొనసాగుతున్నాయి. అన్నయ్య కోలుకుంటున్న తీరుపట్ల డాక్టర్లు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీబీ ఆరోగ్యంగా ఉండాలని అందరూ ప్రార్థిస్తున్నారు. తప్పకుండా అన్నయ్య కోలుకుని వచ్చేస్తారు. అందరికీ థ్యాంక్స్” అని ఎస్పీ శైలజ పేర్కొన్నారు.
Also Read:
తగ్గిన బంగారం ధరలు, తాజా రేట్లు ఇలా !
షాకింగ్ సర్వే : సాత్ ఇండియాలో 94% మంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోనే లేదు