సింగరేణికి మరో వందేండ్ల సుస్థిర భవిష్యత్ ఉందని, సింగరేణి 131వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సంస్థ ఉద్యోగులు, కార్మికులకు సంస్థ సీఎండీ శ్రీధర్ శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ లక్ష్యాలను సాధిస్తున్న కార్మికులను అభినందించారు. దేశంలో బొగ్గుతోపాటు థర్మల్, సౌరవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఏకైక సంస్థ సింగరేణి మాత్రమేనని అన్నారు. సింగరేణి కాలరీస్ ఆవిర్భవించి నేటితో వందేండ్లు నిండాయి. హైదరాబాద్ దక్కన్ కంపెనీ 1889లో ఇల్లెందులో వద్ద తొలిసారిగా బొగ్గును ఉత్పత్తి చేసింది. అయితే 1920లో సింగరేణి కాలరీస్‌గా అవతరించింది. సింగరేణి కాలరీస్‌లో నిజాం షేర్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 1945లో తొలి ప్రభుత్వరంగ సంస్థగా సింగరేణి కాలరీస్ ఆవిర్భవించింది. సింగరేణిలో ప్రస్తుతం 45,131 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది 64 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సంస్థ రూ.27 వేల కోట్ల బొగ్గును విక్రయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.7 వేల కోట్ల పన్ను చెల్లిస్తున్నది.
సింగరేణి కాలరీస్ 131వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. పుడమి పొరల్లోంచి బొగ్గును వెలికితీస్తూ దేశ పారిశ్రామిక రంగానికి సింగరేణి వెన్నుదన్నుగా నిలుస్తున్నదని అన్నారు. సిరులవేణి సింగరేణి తెలంగాణకే తలమానికంగా నిలిచిందని ట్వీట్ చేశారు.
తెలంగాణ మకుటం..నల్ల బంగారం..సిరుల సింగారం.. మన సింగరేణి. పుడమి పొరల్లోంచి నల్ల బంగారం వెలికి తీస్తూ దేశ పారిశ్రామికరంగానికి జవసత్వాలను, దక్షిణాది రాష్ట్రాలకు వెలుగు రేఖలను పంచుతూ, తెలంగాణకే తలమానికంగా నిలిచిన సిరులవేణి సింగరేణికి 131వ అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు#Singareni pic.twitter.com/pZwX0sb6T6
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 23, 2020