AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Badminton World Federation : థాయ్‌లాండ్‌ వేదికగా బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌.. సింధు, శ్రీకాంత్ రాణిస్తారా..?

ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ నేటినుంచి ( జనవరి 27) ప్రారంభం కానున్నాయి. భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు...

Badminton World Federation : థాయ్‌లాండ్‌ వేదికగా బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌.. సింధు, శ్రీకాంత్ రాణిస్తారా..?
Rajeev Rayala
|

Updated on: Jan 27, 2021 | 10:49 AM

Share

ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ నేటినుంచి ( జనవరి 27) ప్రారంభం కానున్నాయి. భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. గత ఏడాది చైనా వేదికగా జరుగాల్సిన బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ టోర్నీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడినవిషయం తెలిసిందే. ఈ నెల 27 నుంచి 31 వరకు ఈ టోర్నీ థాయ్‌లాండ్‌లో జరుగనుంది. సీజన్‌ చివర్లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌-8లో నిలిచిన ప్లేయర్లు ఈ టోర్నీలో పోటీపడనుండగా.. కరోనా ఆందోళనతో జపాన్‌, చైనా షట్లర్లు టోర్నీకి దూరమయ్యారు. దాంతో ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్న శ్రీకాంత్‌కు అవకాశం దక్కింది.

మరో వైపు ఇటీవల పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న ప్రపంచ చాంపియన్‌ సింధు.. పోటీ తీవ్రంగా ఉండే ఈ టోర్నీలో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మెగా టోర్నీ క్వాలిఫికేషన్‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌ తర్వాత 17వ ర్యాంక్‌‌‌‌లో ఉన్న సింధు.. గత వారం థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో క్వార్టర్‌‌‌‌ఫైనల్‌‌‌‌ చేరడంతో పదో ర్యాంక్‌‌‌‌కు చేరి బెర్తు దక్కించుకుంది. గతవారం థాయ్​లాండ్​ ఓపెన్​ క్వార్టర్‌‌ఫైనల్లో కొన్నిసార్లు రచనోక్‌‌పై సింధు పైచేయి సాధించింది. ఆ మ్యాచ్‌‌లో చేసిన మిస్టేక్స్‌‌ను సరిదిద్దుకుంటే మెరుగైన పెర్ఫామెన్స్‌‌ ఆశించొచ్చు.  గతంలో ప్రపంచ మాజీ నెం.1గా ఉన్న శ్రీకాంత్​కు ఈ ఏడాది కలిసి రాలేదు. గాయం కారణంగా యోనెక్స్​ థాయ్​లాండ్​ ఓపెన్​ నుంచి నిష్క్రమించిన అతడు, టొయొటా థాయ్​లాండ్ ఓపెన్ నుంచి సాయి ప్రణీత్​కు కరోనా సోకడం వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. మరి ఈ ఇద్దరు ఈ మెగా టోర్నీలో ఎలా రాణిస్తారో చూస్తుండాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

రెండు టెస్ట్‌లకు దూరమవడం బాధాకరం.. రెస్ట్ తర్వాత టీం ఇండియాపై చెలరేగిపోతానంటున్న ఇంగ్లాండ్ క్రికెటర్

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!