రెండు టెస్ట్‌లకు దూరమవడం బాధాకరం.. రెస్ట్ తర్వాత టీం ఇండియాపై చెలరేగిపోతానంటున్న ఇంగ్లాండ్ క్రికెటర్

Jonny Bairstow: ఇంగ్లాండ్‌ టెస్టు జట్టులోకి తిరిగి రావడం సంతోషం కలిగించిందని కానీ టీమ్‌ ఇండియాతో తొలి రెండు టెస్టులకు దూరమవ్వడం

రెండు టెస్ట్‌లకు దూరమవడం బాధాకరం.. రెస్ట్ తర్వాత టీం ఇండియాపై చెలరేగిపోతానంటున్న ఇంగ్లాండ్ క్రికెటర్
Follow us

|

Updated on: Jan 27, 2021 | 5:23 AM

Jonny Bairstow: ఇంగ్లాండ్‌ టెస్టు జట్టులోకి తిరిగి రావడం సంతోషం కలిగించిందని కానీ టీమ్‌ ఇండియాతో తొలి రెండు టెస్టులకు దూరమవ్వడం బాధకలిగిస్తోందని అంటున్నాడు ఇంగ్లాండ్‌ ఆటగాడు జానీ బెయిర్‌స్టో. అతడికి విశ్రాంతినివ్వడంతో సెలక్టర్లపై మాజీ క్రికెటర్లు మైకేల్‌ వాన్‌, కెవిన్‌ పీటర్సన్‌ తదితరులు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై జానీ బెయిర్‌స్టో స్పందించాడు.

ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకెప్పుడు విశ్రాంతినిస్తారు. ప్రస్తుత ప్రపంచం ఇలాగే ఆలోచిస్తోంది. మూడు ఫార్మాట్లు ఆడుతున్న ఆటగాడు సిరీస్‌ సాంతం ఆడుతున్న సందర్భాలు తక్కువని పేర్కొన్నాడు. వేసవి, శీతాకాలంలో సుదీర్ఘంగా క్రికెట్‌ జరిగింది. అన్నింటా ఆడలేం కదా. బయో బుడగ నుంచి బయటకెళ్లి కుటుంబ సభ్యులను చూడాల్సిన అవసరం ఉంది. విశ్రాంతి తర్వాత ఇండియాపై తాను చెలరేగిపోతానని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఎరుపు బంతి క్రికెట్‌ ఆడటం తనకిష్టమని కానీ బయో బుడగల మధ్య ఆడటం కాస్త భిన్నంగా, కష్టంగా ఉందని చెబుతున్నాడు.

COVID VACCINE: కరోనా వ్యాక్సిన్ విషయంలో డబ్లూహెచ్‌వో సంచలన నిర్ణయం.. వారికి ప్రాధాన్యత అవసరం లేదని ప్రకటన..