తమన్నా కోరిక.. నెరవేరుస్తానన్న శ్రుతీ

| Edited By: Srinu

Mar 07, 2019 | 5:51 PM

సినీ ఇండస్ట్రీలలో బెస్ట్ ఫ్రెండ్ లిస్ట్‌లో తమన్నా, శ్రుతీ హాసన్ ఒకరు. వీరిద్దరు కలిసి ఇంతవరకు ఒక్క చిత్రంలో నటించకపోయినప్పటికీ.. బయట చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఖాళీ టైమ్ దొరికినప్పుడు ఈ ఇద్దరు విదేశాలకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా తాజాగా తమన్నా ఓ కోరికను బయట పెట్టగా.. దానిని నెరవేరుస్తానని శ్రుతీ హాసన్ సోషల్ మీడియా సాక్షిగా తెలిపింది. ఓ తమిళ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. ‘‘ఏదైనా అల్లరి పనిని నేను […]

తమన్నా కోరిక.. నెరవేరుస్తానన్న శ్రుతీ
Follow us on

సినీ ఇండస్ట్రీలలో బెస్ట్ ఫ్రెండ్ లిస్ట్‌లో తమన్నా, శ్రుతీ హాసన్ ఒకరు. వీరిద్దరు కలిసి ఇంతవరకు ఒక్క చిత్రంలో నటించకపోయినప్పటికీ.. బయట చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఖాళీ టైమ్ దొరికినప్పుడు ఈ ఇద్దరు విదేశాలకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా తాజాగా తమన్నా ఓ కోరికను బయట పెట్టగా.. దానిని నెరవేరుస్తానని శ్రుతీ హాసన్ సోషల్ మీడియా సాక్షిగా తెలిపింది.

ఓ తమిళ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. ‘‘ఏదైనా అల్లరి పనిని నేను శ్రుతీతో చేసేందుకు ఇష్టపడాను. ఆమెకు ఫోన్ చేసి మరీ పిలుస్తాను. అంతేకాదు ఒకవేళ మరో హీరోయిన్‌తో కలిసి నటించే అవకాశం వస్తే కచ్చితంగా శ్రుతీతో చేస్తాను’’ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియోపై స్పందించిన శ్రుతీ.. ‘‘థ్యాంక్యు తమన్నా. మనమిద్దరం త్వరలో ఓ సినిమా చేద్దాం’’ అంటూ హామీ ఇచ్చింది. మరి ఈ ఇద్దరికి నచ్చేలా ఏ దర్శకుడు కథను రాసుకుంటాడో చూడాలి.