AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్..సామాన్యుడికి రూ.కోటి కరెంటు బిల్లు…

ఉత్తరప్రదేశ్​ సోన్​భద్ర జిల్లాలో నివాసం ఉంటోన్న గిరిజన కుటుంబాల ప్రజలు.. వారి తాజా కరెంటు బిల్లలను చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. అసలే అడవి బిడ్డలు...వారికి విలాసవంతమైన జీవితం గడపడం తెలీదు..అయినా ఊహకందనంతగా వచ్చిన విద్యుత్ బిల్లుల గురించి ఎవరిని కలవాలో వారికి తెలియడం లేదు. వారిలో కొన్ని కుటుంబాలు కేవలం ఒక్క  బల్బు మాత్రమే పెట్టుకోని జీవితం వెళ్లదీస్తుండటం గమనార్హం. 

షాకింగ్..సామాన్యుడికి రూ.కోటి కరెంటు బిల్లు...
Ram Naramaneni
| Edited By: |

Updated on: Feb 28, 2020 | 7:14 PM

Share

ఉత్తరప్రదేశ్​ సోన్​భద్ర జిల్లాలో నివాసం ఉంటోన్న గిరిజన కుటుంబాల ప్రజలు.. వారి తాజా కరెంటు బిల్లులను చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. అసలే అడవి బిడ్డలు…వారికి విలాసవంతమైన జీవితం గడపడం తెలీదు..అయినా ఊహకందనంతగా వచ్చిన విద్యుత్ బిల్లుల గురించి ఎవరిని కలవాలో వారికి తెలియడం లేదు. వారిలో కొన్ని కుటుంబాలు కేవలం ఒక్క  బల్బు మాత్రమే పెట్టుకోని జీవితం వెళ్లదీస్తుండటం గమనార్హం.  మొత్తం 156 కుటుంబాల్లో.. కనిష్ఠంగా  రూ.6 వేల నుంచి గరిష్ఠంగా రూ.1 కోటి వరకు బిల్లులు వచ్చాయి. ఇంత ఎలా వచ్చింది..తాము కట్టలేమంటే..సాగు చేసుకునే భూములు వేలం వేస్తానంటున్నారు అధికారులు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సౌభాగ్య ప్రధాన్ మంత్రి సహజ్​ బిజిలీ హర్​ ఘర్ యోజన’ కింద సోన్​భద్ర జిల్లాలో  గిరిజన కుటుంబాలకు అధికారులు విద్యుత్​ కనెక్షన్లు ఇచ్చారు. అయితే అక్కడ నివశించే అమర్​నాథ్​ ఇంటికి రూ.కోటి కరెంట్ బిల్లు రాగా.. ఆ ప్రాంతంలో నివసిస్తున్న మరో 156 ఇళ్లకు అధిక మొత్తంలో బిల్లు వచ్చింది. ఈ గందరగోళంపై విద్యుత్ శాఖ.. దుద్దీ జూనియర్ ఇంజనీర్ మనోజ్ కుమార్ రెస్పాండ్ అయ్యారు. పై స్థాయిలో ఏదో పొరపాటు జరిగిందిని… వాళ్లే సరిదిద్దాల్సి ఉంటుందని తెలిపారు. బిల్లులపై తమ స్థాయిలో విచారణ జరిపి పై అధికారులకు రిపోర్ట్ చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.