రూ.10కే కడుపునిండేంత భోజనం.. ఎక్కడో తెలుసా.?

|

Jan 25, 2020 | 3:02 PM

అన్ని దానాల్లో కంటే అన్నదానం మిన్న అంటారు. అదీ కాకుండా పేదవాడి ఆకలి తీరిస్తే అంతకంటే మహాభాగ్యం ఇంకేముంటుంది. ఇక దీన్ని సాకారం చేస్తూ మహారాష్ట్రలో అధికారం చేపట్టిన శివసేన సర్కార్  రూ.10కే కడుపునిండేంత భోజనాన్ని ప్రతీ ఒక్కరికీ అందించే విధంగా రూ.10 థాలి అనే పేరుతో నూతన పథకాన్ని రిపబ్లిక్ డే రోజున ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నేషనల్ ఇన్ఫోర్మాటిక్స్ సెంటర్(ఎన్‌ఐసీ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ పథకానికి అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్ […]

రూ.10కే కడుపునిండేంత భోజనం.. ఎక్కడో తెలుసా.?
Follow us on

అన్ని దానాల్లో కంటే అన్నదానం మిన్న అంటారు. అదీ కాకుండా పేదవాడి ఆకలి తీరిస్తే అంతకంటే మహాభాగ్యం ఇంకేముంటుంది. ఇక దీన్ని సాకారం చేస్తూ మహారాష్ట్రలో అధికారం చేపట్టిన శివసేన సర్కార్  రూ.10కే కడుపునిండేంత భోజనాన్ని ప్రతీ ఒక్కరికీ అందించే విధంగా రూ.10 థాలి అనే పేరుతో నూతన పథకాన్ని రిపబ్లిక్ డే రోజున ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే నేషనల్ ఇన్ఫోర్మాటిక్స్ సెంటర్(ఎన్‌ఐసీ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ పథకానికి అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనుంది. మొదటి దశలో భాగంగా ముంబైలోని 15 ప్రదేశాలతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రిల్లోనూ రూ.10 థాలి అందుబాటులో ఉంచనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు శివసేన పార్టీ ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి విదితమే. ముఖ్యంగా ఈ పథకం పేదల కోసమని అప్పట్లో జరిగిన ఓ ర్యాలీలో ఉద్దవ్ థాక్రే స్పష్టం చేశారు. అయితే ఈ పథకం కింద పేదలుగా ఎవరిని పరిగణనలోకి తీసుకుంటారో.. ప్రజల ఆదాయాలను ఎలా ధృవీకరిస్తారో అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే మొదటి మూడు నెలలు మాత్రం అందరూ కూడా ఆధార్‌ వివరాలను అందించి రూ.10 థాలి తీసుకోవచ్చునని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రాధమిక అంచనా ప్రకారం, ఈ పథకానికి మూడు నెలలకు గానూ రూ.6.4 కోట్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. భోజనంలో రెండు చపాతీలు, 100 గ్రాముల కూరగాయలు, 150 గ్రాముల అన్నం, 100 గ్రాముల పప్పు ఉంటాయి. ఇక దీనికి కాంట్రాక్టర్లకు రూ.50 ఖర్చు కానుండగా.. అందులో రూ.40 ప్రభుత్వం భరించనుంది. కాగా, శివసేన సర్కార్ చేపట్టిన ఈ నూతన పథకం తమిళనాడు దివంగత సీఎం జయలలిత ప్రవేశపెట్టిన అమ్మ క్యాంటీన్‌ల నుంచి ప్రేరణ పొందినదే. 

మరోవైపు ముంబైలో ఇకపై 24 గంటలూ రెస్టారెంట్లు, హోటళ్లు, మాల్స్, మల్టీ‌ప్లక్స్‌లు ఉంచుతూ మహా కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. లండన్‌లో మాదిరిగానే పర్యాటక రంగం అభివృద్ధి, ఉద్యోగాల అవకాశం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని పర్యాటకశాఖ మంత్రి ఆదిత్య థాక్రే తెలిపారు.