షిర్డీలోకి నో ఎంట్రీ.. సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌పై తాత్కాలిక నిషేదం…

సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌పై షిర్డీ అధికారులు ఆంక్షలు విధించారు. మహారాష్ట్రలోని షిర్డీలోకి ప్రవేశించకుండా సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌పై తాత్కాలిక నిషే దం విధించారు. ఈనెల 11న...

షిర్డీలోకి నో ఎంట్రీ.. సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌పై తాత్కాలిక నిషేదం...
Follow us

|

Updated on: Dec 09, 2020 | 6:06 AM

సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌పై షిర్డీ అధికారులు ఆంక్షలు విధించారు. మహారాష్ట్రలోని షిర్డీలోకి ప్రవేశించకుండా సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌పై తాత్కాలిక నిషేదం విధించారు. ఈనెల 11న అర్ధరాత్రి వరకు ఈ పట్టణం పరిధిలోకి అడుగు పెట్టరాదంటూ షిర్డీ ఏరియా సబ్‌-డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ గోవింద్‌ షిండే మంగళవారం అర్ధరాత్రి ఆదేశాలు జారీచేశారు.

‘భక్తుల వస్త్రధారణ హుందాగా ఉండాలి’ అని విజ్ఞప్తి చేస్తూ షిర్డీ ఆలయ అధికారులు ఏర్పాటుచేసిన బోర్డులను తొలగిస్తానంటూ తృప్తి దేశాయ్‌ ఇటీవల హెచ్చరించారు. ఈనేపథ్యంలో శాంతి,భద్రతల పరిరక్షణ దృష్ట్యా డిసెంబరు 11వ తేదీ వరకు షిర్డీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోకి ప్రవేశించరాదంటూ ఆమెకు నోటీసులు జారీ చేశారు.