AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mega DSC Age limit: డీఎస్సీ వయోపరిమితి పెంపుపై విద్యాశాఖ కసరత్తులు.. మంత్రి నారా లోకేశ్‌ వెల్లడి

త్వరలో వెలువడనున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించి మంత్రి నారా లోకేస్ కీలక అప్ డేట్ ఇచ్చారు. అభ్యర్ధుల వయోపరిమితి పెంపుపై కరసరత్తులు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి న్యావపరమైన వివాదాలు తలెత్తకుండా అందరికీ సమ న్యాయం జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు..

Mega DSC Age limit: డీఎస్సీ వయోపరిమితి పెంపుపై విద్యాశాఖ కసరత్తులు.. మంత్రి నారా లోకేశ్‌ వెల్లడి
Mega DSC Age limit
Srilakshmi C
|

Updated on: Nov 15, 2024 | 2:48 PM

Share

అమరావతి, నవంబర్‌ 15: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ నామస్మరణ జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూలేని విధంగా అత్యధికంగా టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని కుటమి ప్రభుత్వం హామీ ఇవ్వడమే అందుకు కారణం. ఏకంగా 16,317 టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం డీఎస్సీ ఫైల్‌పైనే పెట్టారు. ఇక మెగా డీఎస్సీలో అధికమందికి అవకాశం ఇవ్వాలనే సంకల్పంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో టెట్‌ నిర్వహించినప్పటికీ..మరోమారు టెట్‌ పరీక్ష నిర్వహించి నవంబర్‌ తొలివారంలో ఫలితాలు కూడా వెల్లడించారు. అయితే టెట్‌ ఫలితాలు వెల్లడించిన మరుసటి రోజే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని చెప్పినప్పటికీ.. నవంబర్‌ నెల ప్రారంభమై పక్ష్యం రోజులు గడుస్తున్నా ఇంతవరకూ నోటిఫికేషన్‌ రాకపోవడంపై నిరుద్యోగులు పెదవి విరుస్తున్నారు. తాజాగా ఈ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ యుద్ధప్రాతిపదికన నోటిఫికేషన్‌ ఇస్తామని చెప్పారు.

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని తాజాగా మంత్రి నారా లోకేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. న్యాయపరంగా చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఆయన తాజాగా ప్రసంగించారు. గత ఐదేళ్లలో ఉద్యోగ నియమకాలు సున్నా అని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. ఐదేళ్లలో డీఎస్సీ ద్వారా ఒక్క పోస్టు భర్తీ చేయలేదని మండిపడ్డారు. ఉపాధ్యాయులపై గత ప్రభుత్వ హయాంలో పెట్టిన అక్రమ కేసులు అన్నింటినీ ఎత్తేస్తామన్నారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్రంలో మొత్తంగా 15 సార్లు డీఎస్సీ నిర్వహించామని వెల్లడించారు. ప్రస్తుతం కూటమి సర్కార్ మెగా డీఎస్సీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులకు వయో పరిమితిని పెంపుపై చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్‌లో ఉపాధ్యాయుల్ని కూడా భాగస్వామ్యం చేస్తామని నారా లోకేశ్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.