హ్యాంగోర్‌ను తగ్గించడంలో అల్లం బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అల్లం టీని తాగితే హ్యాంగోవర్ ద్వారా వచ్చే తలనొప్పి సమస్య దూరమవుతుంది.
ఆల్కహాల్ సేవించడం ద్వారా శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. కాబట్టి హ్యాంగోవర్ సమస్య తగ్గాలంటే నీటిని ఎక్కువగా తీసుకోవాలి.
హ్యాంగోవర్ సమస్య నుంచి బయటపడాలంటే కొబ్బరి నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఎలక్ట్రోలైట్స్ హ్యాంగోవర్‌ను దూరం చేయడంలో సహాయపడతాయి.
సిట్రస్ పండ్లైన ఆరెంజ్, కివీ వంటివి తీసుకోవడం వల్ల కూడా హ్యాంగోవర్ సమస్య నుంచి బయటపడొచ్చు. జ్యూస్ చేసుకొని తాగినా ఫలితం ఉంటుంది.
హ్యాంగోవర్ తగ్గాలంటే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగాలి. ఇలా చేస్తే వికారం, వాంతి, తలనొప్పి సమస్య దూరమవుతుంది.
పెరుగుతో భోజనం చేసినా హ్యాంగోవర్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తందని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగ తాగినా మంచి ఫలితం ఉంటుంది.
అరటి పండు కూడా హ్యాంగోవర్‌ను దూరం చేస్తుంది. ముఖ్యంగా ఉదయం లేవగానే అరటి పండును తీసుకోవడం ద్వారా శరీరంలో ఇన్‌స్టాంట్ ఎనర్జీ వస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.