100 రోజులు.. వేల మైళ్ల వరకు పరుగులు.. అసలెందుకో..?

| Edited By:

Jun 19, 2019 | 12:02 PM

మనుషులంతా ఒక్కటేననే భావనలో జీవించాలని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఓ మారథాన్ రన్నర్ యూనిక్ మిషన్ పరుగును మొదలు పెట్టింది. ఢిల్లీకి చెందిన 33 ఏళ్ల సుఫియా సుఫి.. 100 రోజుల్లో 11 రాష్ట్రాలు, 25 నగరాలు, వేలాది గ్రామాల మీదుగా పరుగును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్‌ 25న తన పరుగును ప్రారంభించిన సుఫియా.. జమ్మూకాశ్మీర్‌, పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్టాల్లో తన పరుగును పూర్తి చేసుకుని ముంబైకి చేరింది. […]

100 రోజులు.. వేల మైళ్ల వరకు పరుగులు.. అసలెందుకో..?
Follow us on

మనుషులంతా ఒక్కటేననే భావనలో జీవించాలని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఓ మారథాన్ రన్నర్ యూనిక్ మిషన్ పరుగును మొదలు పెట్టింది. ఢిల్లీకి చెందిన 33 ఏళ్ల సుఫియా సుఫి.. 100 రోజుల్లో 11 రాష్ట్రాలు, 25 నగరాలు, వేలాది గ్రామాల మీదుగా పరుగును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్‌ 25న తన పరుగును ప్రారంభించిన సుఫియా.. జమ్మూకాశ్మీర్‌, పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్టాల్లో తన పరుగును పూర్తి చేసుకుని ముంబైకి చేరింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన విద్వేషం వ్యాప్తి చెందుతోందని.. తన పరుగు అందుకు కౌంటర్‌గా ఉంటుందని భావిస్తున్నానని చెబుతోంది. మనుషులంతా మానవత్వం, ఏకత్వం, శాంతి, సమానత్వంతో జీవించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పింది. అయితే ఇప్పటివరకూ తన సొంతడబ్బులనే ఈ మిషన్‌కు ఉపయోగించానన్న ఆమె ప్రస్తుతం విరాళాలు సేకరణకు పూనుకుంటున్నట్టు తెలిపింది. మొత్తం 15 రోజుల్లో 720 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసుకుని ఈ ఘనతను అందుకుంది.