సరికొత్తలుక్ లో దర్శనమించిన షారుక్ ఖాన్ .. ఆ సినిమా కోసమే అంటున్న అభిమానులు

|

Nov 30, 2020 | 5:19 PM

బాలీవుడ్ బాద్షా  షారుఖాన్ సినిమా కోసం అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. షారుక్ నటించిన జీరో సినిమా దారుణంగా నిరాశపడటం తో అభిమానులంతా షారుక్ నుంచి సాలిడ్ హిట్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో షారుక్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

సరికొత్తలుక్ లో దర్శనమించిన షారుక్ ఖాన్ .. ఆ సినిమా కోసమే అంటున్న అభిమానులు
Follow us on

బాలీవుడ్ బాద్షా  షారుఖాన్ సినిమా కోసం అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. షారుక్ నటించిన జీరో సినిమా దారుణంగా నిరాశపడటం తో అభిమానులంతా షారుక్ నుంచి సాలిడ్ హిట్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో షారుక్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో షారుక్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తో పాటు య‌శ్‌రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్ లో షారుక్ ఖాన్ ‘ప‌ఠాన్’ అనే కొత్త చిత్రాన్ని చేస్తున్న‌ట్టు కొంత‌కాలంగా బాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.

తాజాగా య‌శ్‌రాజ్ ఫిలింస్ స్టూడియో దగ్గర షారుక్ ఖాన్ అభిమానుల కంట పడ్డారు. పొడవాటి జుత్తుతో చాలా స్టైలిష్ గా కనిపించడు బాద్షా. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ గెట‌ప్ షారుక్ కొత్త సినిమాదేన‌ని అభిమానులు తెగ చ‌ర్చించుకుంటున్నారు. షారుక్ సైలెంట్ గా ‘ప‌ఠాన్’ షూటింగ్ ను  షురూ చేసినట్టు బీటౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుండగా జాన్ అబ్రహం కీలక పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.