ఏపీలో దారుణం.. మైనర్ బాలుడిపై గ్యాంగ్ రేప్…

Sexual Crime In Kurnool: కర్నూలులో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని అవుకు మండలం టీడీపీ కార్యాలయంలో నలుగురు వ్యక్తులు మైనర్ బాలుడుపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. తెలుగుపేటకు చెందిన 14 ఏళ్ల మైనర్ బాలుడిని డిన్నర్ ఉందంటూ బుల్లెట్ రాజ్, ప్రేమకుమార్, రాజా, సునీల్ అనే నలుగురు వ్యక్తులు స్థానిక టీడీపీ కార్యాలయానికి పిలిపించుకున్నారు. అభం శుభం తెలియని ఆ పిల్లాడిపై ఈ నలుగురు యువకులు దారుణమైన చర్యకు […]

ఏపీలో దారుణం.. మైనర్ బాలుడిపై గ్యాంగ్ రేప్...
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 31, 2020 | 5:57 AM

Sexual Crime In Kurnool: కర్నూలులో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని అవుకు మండలం టీడీపీ కార్యాలయంలో నలుగురు వ్యక్తులు మైనర్ బాలుడుపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. తెలుగుపేటకు చెందిన 14 ఏళ్ల మైనర్ బాలుడిని డిన్నర్ ఉందంటూ బుల్లెట్ రాజ్, ప్రేమకుమార్, రాజా, సునీల్ అనే నలుగురు వ్యక్తులు స్థానిక టీడీపీ కార్యాలయానికి పిలిపించుకున్నారు. అభం శుభం తెలియని ఆ పిల్లాడిపై ఈ నలుగురు యువకులు దారుణమైన చర్యకు పాల్పడటమే కాకుండా లైంగిక వేధింపులకు గురి చేశారు.

ఈ విషయం బాలుడి తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఇక  తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన విచారణ చేపట్టారు. ఇప్పటికే నలుగురు యువకుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.