కొత్త కౌన్సిలర్లకు కేటీఆర్ సీరియస్ వార్నింగ్

ఇటీవలి మునిసిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తప్పు చేస్తే సహించేది లేదని కుండబద్దలు కొట్టారాయన. ‘‘నిన్న మొన్నటి వరకు ఎవరు అయినా ఇల్లు కట్టినా అక్కడ కౌన్సిలర్లు వాలి పోయి డబ్బులు వసూలు చేస్తారనే ఆరోపణ వినిపించేది.. అది గతం..ఇప్పుడు అలా చేస్తే క్షమించను…ఎమ్మెల్యే చేత పైరవీ చేసినా ఉరుకోను.. జాగ్రత్తగా ఉండండి సీఎం చాలా సీరియస్‌గా ఉన్నారు…’’ ఇది కేటీఆర్ […]

కొత్త కౌన్సిలర్లకు కేటీఆర్ సీరియస్ వార్నింగ్
Follow us

| Edited By: Srinu

Updated on: Jan 30, 2020 | 4:59 PM

ఇటీవలి మునిసిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తప్పు చేస్తే సహించేది లేదని కుండబద్దలు కొట్టారాయన. ‘‘నిన్న మొన్నటి వరకు ఎవరు అయినా ఇల్లు కట్టినా అక్కడ కౌన్సిలర్లు వాలి పోయి డబ్బులు వసూలు చేస్తారనే ఆరోపణ వినిపించేది.. అది గతం..ఇప్పుడు అలా చేస్తే క్షమించను…ఎమ్మెల్యే చేత పైరవీ చేసినా ఉరుకోను.. జాగ్రత్తగా ఉండండి సీఎం చాలా సీరియస్‌గా ఉన్నారు…’’ ఇది కేటీఆర్ గురువారం చేసిన కామెంట్. కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో కేటీఆర్ గురువారం తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు.

రాహుల్ గాంధీ, చంద్రబాబు కాలికి బలపం కట్టుకొని తిరిగినా కూడా గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అత్యధిక సీట్లు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీని గెలిపించారని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు టీఆర్ఎస్ పార్టీకే వచ్చాయని ఆయనన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. మునిసిపాలిటీలకు 2030 కోట్లు ప్రతి సంవత్సరం నిధులు విడుదల చేస్తామన్నారు. మిషన్ భగీరథ ద్వారా మంచి నీళ్ళు బ్రహ్మాండంగా వస్తున్నాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ముసినిపల్ చట్టంపై చైర్మన్‌లు, కౌన్సిలర్లకు శిక్షణ తరగతులు త్వరలోనే నిర్వహిస్తామని వెల్లడించారు.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు