బుల్ రన్‌లో స్టాక్ మార్కెట్లు

| Edited By:

May 24, 2019 | 6:40 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఎన్‌డీఏ ప్రభుత్వ విజయాన్ని మార్కెట్లు ఇంకా ఆస్వాదిస్తున్నాయి. నేడు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 623 పాయింట్లు పెరిగి 39,434 వద్ద, నిఫ్టీ 187 పాయింట్లు పెరిగి 11,844 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారీగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడికాప్‌ సూచీ 1.54శాతం లాభపడింది. ఇక స్మాల్‌కాప్‌ సూచీ కూడా 1.92శాతం లాభపడింది. జేఎంసీ ప్రాజెక్టు షేర్లు 11శాతం లాభపడ్డాయి. దాదాపు […]

బుల్ రన్‌లో స్టాక్ మార్కెట్లు
Follow us on

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఎన్‌డీఏ ప్రభుత్వ విజయాన్ని మార్కెట్లు ఇంకా ఆస్వాదిస్తున్నాయి. నేడు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 623 పాయింట్లు పెరిగి 39,434 వద్ద, నిఫ్టీ 187 పాయింట్లు పెరిగి 11,844 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారీగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడికాప్‌ సూచీ 1.54శాతం లాభపడింది. ఇక స్మాల్‌కాప్‌ సూచీ కూడా 1.92శాతం లాభపడింది. జేఎంసీ ప్రాజెక్టు షేర్లు 11శాతం లాభపడ్డాయి. దాదాపు రూ.616 కోట్లు విలువైన గృహ, వాణిజ్య ప్రాజెక్టులకు సంబంధించిన కాంట్రాక్టులు దక్కడంతో ఇలా స్పందించాయి.