
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమాను చేస్తుండగా.. ఇటు ‘ఆదిపురుష్’ సినిమా కూడా ఇటీవలే ప్రారంభమైంది. ఇక ప్రభాస్ ‘జిల్’ ఫేం రాధకృష్ణ కుమార్ డైరెక్షన్లో నటిస్తున్న ‘రాధేశ్యామ్’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక మూవీలో ప్రభాస్ పెదనాన్న సీనియర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘రాధే శ్యామ్’ లో పరమహంస అనే క్యారెక్టర్లో కనిపించనున్నట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. ‘రాధేశ్యామ్’ సెట్లో వీరిద్దరు కలిసి ఫోటోకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఇవి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుండగా.. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‍గా నటిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను హిందీ వెర్షన్ కు ఇద్దరు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. మిథున్ సంగీత దర్శకత్వంలో రెండు సినిమాలు, మనన్ భరద్వార్ ఒక పాటకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించనుంది. గోపికృష్ణా మూవీస్ ప్రై.లి. ‘రెబల్ స్టార్’ డా.యు.వి.కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలు నిర్మస్తున్నాయి. కృష్ణం రాజు కుమార్తె, ప్రభాస్ సోదరి ప్రసీద ఉప్పలపాటి నిర్మాతగా పరిచయమవుతున్నారు.
Reminiscing the 70s with #Prabhas ?
Let’s go back in time with #RadheShyam on 30th July! pic.twitter.com/xhJD96U36i— U.V.Krishnam Raju (@UVKrishnamRaju) February 16, 2021
Also Read:
సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్న సర్కారు వారి పాట టీమ్.. ఆ రోజున సినిమా అప్డేట్..