గొల్లపూడి మృతికి ప్రముఖుల సంతాపం…

|

Dec 12, 2019 | 6:55 PM

ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు తెలుగు భాషాభివృద్ధికి దిశానిర్దేశం చేశాయని కేసీఆర్ అన్నారు. అటు మారుతీరావుకి ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నటుడు అలీ తదితర ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు. మరోవైపు గొల్లపూడి మారుతీ […]

గొల్లపూడి మృతికి ప్రముఖుల సంతాపం...
Follow us on

ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు తెలుగు భాషాభివృద్ధికి దిశానిర్దేశం చేశాయని కేసీఆర్ అన్నారు. అటు మారుతీరావుకి ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నటుడు అలీ తదితర ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు.

మరోవైపు గొల్లపూడి మారుతీ రావు మృతికి  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొల్లపూడి మారుతీ రావు బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎంతో గుర్తింపు పొందారని.. ఆయన మృతితో చిత్ర పరిశ్రమ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని పేర్కొన్నారు.