మూగ రోదన… పరిమితికి మించి పశువులు..

|

Aug 16, 2020 | 12:26 AM

పరిమితికి మించి పశువులు తరలిస్తున్న వ్యాన్‌ను పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ నుంచి నిర్మల్‌ జిల్లా భైంసాకు వ్యాన్‌లో 23 పశువులను తీసుకువస్తున్నారు....

మూగ రోదన... పరిమితికి మించి పశువులు..
Follow us on

పరిమితికి మించి పశువులు తరలిస్తున్న వ్యాన్‌ను పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ నుంచి నిర్మల్‌ జిల్లా భైంసాకు వ్యాన్‌లో 23 పశువులను తీసుకువస్తున్నారు. మాలేగాంవ్‌ చౌరస్తా వద్ద  తనిఖీ చేస్తుండగా ఈ వ్యాన్ పట్టుబడింది. పశువైద్యాధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రంలో ఆరు పశువులను మాత్రమే తీసుకెళ్లాలని ఉన్నది.

అయితే పరిమితికి మించి ప శువులు తీసుకురావడంతో ఊపి రి ఆడక నాలుగు పశువులు మృతి చెందాయి. మరో రెండింటి పరిస్థి తి విషమంగా ఉంది. పశువైద్యాధికారులతో పంచనామా చేసి మిగతా పశువులకు పోలీస్‌ స్టేషన్లోనే చికిత్స అందించారు. వాహనాన్ని సీజ్‌ చేసి, డ్రైవర్‌ తయిఫ్‌ మియాజ్‌, ఎండీ షబ్బీర్‌, ఎస్కే ఇమ్రాన్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పశువులను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని పోలీస్ అధికారులు హెచ్చరించారు.