రైతును మోసం చేసిన విత్తన సంస్థకు ఫైన్.. రూ.2.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Nov 13, 2020 | 6:18 PM

నష్టపోవడం రైతులకు, ముంచెయ్యడం కొన్ని విత్తన కంపెనీలకు అలవాటు అయ్యిపోయింది. అన్నదాతలు ఎన్నిసార్లు ఆవేదన వ్యక్తం చేసినా, ఆందోళనలు చేసినా ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.

రైతును మోసం చేసిన విత్తన సంస్థకు ఫైన్.. రూ.2.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం

నష్టపోవడం రైతులకు, ముంచెయ్యడం కొన్ని విత్తన కంపెనీలకు అలవాటు అయ్యిపోయింది. అన్నదాతలు ఎన్నిసార్లు ఆవేదన వ్యక్తం చేసినా, ఆందోళనలు చేసినా ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. కానీ తాజాగా అనంతపురం జిల్లా పామిడి మండలానికి చెందిన లక్ష్మీనారాయణరెడ్డి అనే రైతుకు వినియోగదారుల కమిషన్ న్యాయం చేసింది. వివరాల్లోకి వెళ్తే…మణికంఠ ఆగ్రో ఏజెన్సీస్‌లో రూ.6,880తో పత్తి విత్తనాలను కొని రెండున్నర ఎకరాల్లో సాగు చేశారు లక్ష్మీనారాయణరెడ్డి. పంట ఎంతకీ రాకపోవడంతో వ్యవసాయాధికారులకు సమాచారమిచ్చారు. విత్తనాలిచ్చిన షాపు ఓనర్ వద్దకు వెళ్లి నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు.

ఆ తర్వాత ఆయనకు, ముంబయికి చెందిన విత్తన తయారీదారు, అనంతపురానికి చెందిన డిస్ట్రిబ్యూటరుకులీగల్‌ నోటీసులిచ్చారు. అయితే వారు అనంతపురం జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. తామిచ్చిన సూచనలను రైతు పాటించనందునే పంట నష్టం వాటిల్లిందని విత్తన తయారీ సంస్థ కౌంటరు వేసింది. 2017లో జిల్లా కమిషన్‌ ఇరు వర్గాల వాదనలను విని విత్తన సంస్థ తరఫున సేవాలోపం ఉందని గుర్తించింది. విత్తన సంస్థ, సరఫరాదారు, డీలరు కలిసి పంట నష్టానికిగానూ రైతుకు రూ.2.5 లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చింది. తీర్పును  విత్తన సంస్థ సవాల్ చేస్తూ రాష్ట్ర కమిషన్‌ను ఆశ్రయించింది. జిల్లా కమిషన్‌ నిర్ణయాన్నే సమర్థిస్తూ రాష్ట్ర కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ టి.సునీల్‌ చౌదరి, మెంబర్ పి.ముత్యాల నాయుడు తీర్పునిచ్చారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

అయితే అన్నీ ఆధారాలు ఉండబట్టి ఇన్నేళ్ల  తర్వాత న్యాయం జరిగింది. అవే లేకపోతే పరిస్థితి వేరే ఉండేది. అసలు తాము మోసపోయామని వినియోగదారులు కమిషన్ ఆశ్రయించే రైతులు ఎంతమంది ఉంటారు చెప్పండి. అందుకే నకిలీ విత్తన సంస్థలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. అన్నదాతలను మోసం చెయ్యాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

Also Read :

ప్రాణాలు తీసిన కల్తీ మద్యం, ముగ్గురు దుర్మరణం, మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం

ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు బాగున్నాయి, చలి కాలంలో అప్రమత్తత అవసరం : కోటి కమాండ్ సెంటర్ డీహెచ్

తెలుగు ప్రజలకు సీఎంల దీపావళి శుభాకాంక్షలు, ప్రజల జీవితాల్లో పండుగ వెలుగులు నింపాలని ఆకాంక్ష

ఆ ఇద్దరు లెజెండ్‌లు కలిస్తే రోహిత్.. ముంబై సారథిపై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu