కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి ఏపీ ఎస్‌ఈసీ లేఖ.. ఎన్నికల విధులకు కేంద్ర ఉద్యోగులను కేటాయించాలని కోరిన నిమ్మగడ్డ

|

Jan 25, 2021 | 4:07 PM

పీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ రసవత్తరంగా సాగుతుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనభోమని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు తొలి నుంచి మొండికేస్తున్న..

కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి ఏపీ ఎస్‌ఈసీ లేఖ.. ఎన్నికల విధులకు కేంద్ర ఉద్యోగులను కేటాయించాలని కోరిన నిమ్మగడ్డ
Follow us on

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ రసవత్తరంగా సాగుతుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనభోమని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు తొలి నుంచి మొండికేస్తున్న విషయం తెలిసిందే. నామినేషన్ల స్వీకరణకు కూడా ఆఫీసుల్లో ఉద్యోగులు డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు చెప్పిందని, అయితే కొన్ని ఉద్యోగ సంఘాలు సహకరించబోమని ప్రకటిస్తున్నాయని లేఖలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పేర్కొన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని కేటాయించాలని కోరారు. చివరి ప్రయత్నంగా మాత్రమే కేంద్ర ఉద్యోగులను వాడుకుంటామని నిమ్మగడ్డ తెలిపారు.

మరోవైపు.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఉద్యోగ సంఘాల స్వరం మారింది. సుప్రీంకోర్టు తీర్పు పట్ల మిశ్రమంగా స్పందించాయి. తాము ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఎప్పుడూ చెప్పలేదని, ఆరోగ్యం సరిగాలేని ఉద్యోగులను మినహాయించి.. మిగిలిన వారితో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. వాక్సిన్‌ ఇచ్చిన తర్వాత ఉద్యోగులంతా.. ఎన్నికల విధుల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని అన్నారు.