కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌పై సెబీ తాజా ఆంక్షలు, కొత్తగా క్లయింట్లను తీసుకోకుండా నిషేధం

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌పై సెబీ తాజాగా మరిన్ని ఆంక్షలు విధించింది. ఓ క్లయింటుకు సంబంధించిన 2 వేల కోట్ల విలువ చేసే సెక్యూరిటీస్‌ను దుర్వినియోగం..

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌పై సెబీ తాజా ఆంక్షలు, కొత్తగా క్లయింట్లను తీసుకోకుండా నిషేధం
Follow us
Venkata Narayana

|

Updated on: Dec 17, 2020 | 12:26 PM

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌పై సెబీ తాజాగా మరిన్ని ఆంక్షలు విధించింది. ఓ క్లయింటుకు సంబంధించిన 2 వేల కోట్ల విలువ చేసే సెక్యూరిటీస్‌ను దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు దరిమిలా స్టాక్‌ బ్రోకింగ్‌ కార్యకలాపాల కోసం కొత్తగా క్లయింట్లను తీసుకోకుండా కూడా సెబీ నిషేధించింది. క్లయింట్ల పవర్‌ ఆఫ్‌ అటార్నీల ఆధారంగా కేఎస్‌బీఎల్‌ సూచనలు పరిగణనలోకి తీసుకోవద్దని NSDL, CDSLను ఆదేశించింది. ఇలా ఉండగా, గతంలో నమ్మకమైన స్టాక్ బ్రోకింగ్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న కార్వీ ఇటీవల కాలంలో చేజేతులారా తనకున్న మంచి పేరును పోగొట్టుకుంది. కస్టమర్ల సెక్యూరిటీలను సొంతం అవసరాలకు ఉపయోగించుకుంది. దీంతో ఆ కంపెనీకి షాక్‌లమీద షాకులు తగ్గులుతున్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్‌ఈ, ఎన్ఎస్ఈలు డిసెంబర్ 2న కార్వీ స్టాక్ బ్రోకింగ్ ట్రేడింగ్ లైసెన్స్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే.