చిక్కుల్లో పటాన్‌చెరు ఎమ్మెల్యే…రిపోర్టర్‌కు మహిపాల్ రెడ్డి బెదిరింపులు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

|

Dec 09, 2020 | 11:38 PM

పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనపై మహిపాల్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డాడని, అసభ్య పదజాలంతో దూషించారని స్థానిక విలేకరి సంతోష్ నాయక్..

చిక్కుల్లో పటాన్‌చెరు ఎమ్మెల్యే...రిపోర్టర్‌కు మహిపాల్ రెడ్డి బెదిరింపులు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
Follow us on

పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనపై మహిపాల్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డాడని, అసభ్య పదజాలంతో దూషించారని స్థానిక విలేకరి సంతోష్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

గత కొన్ని రోజుల క్రితం పఠాను చెరువు లో జరిగిన అక్రమాలు కబ్జాలపై స్థానిక విలేకరి వరుస కథనాలు రాసాడు. దీనిపై ఆగ్రహం చెందిన పఠానుచెరువు ఎమ్మెల్యే…విలేకరిని ఫోన్లో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. విలేకరి సంతోష్ అంతు చూస్తానంటూ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగారు.

విలేకరిని తిడుతున్న ఆడియో వైరల్ అయింది. దీనిపై విలేకరి సంతోష్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

ఇక ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఆడియో రాజకీయంగా వివాదానికి దారి తీసింది. జర్నలిస్ట్‌పై అసభ్యకరంగా మాట్లాడిన మహిపాల్‌ రెడ్డి అరెస్ట్‌కు బీజేపీ డిమాండ్ చేసింది. విలేకరి సంతోష్ నాయక్‌ను చంపేస్తానంటూ హెచ్చరించిన మహిపాల్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు, స్థానిక విలేకరులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

దీంతో ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి దిగివచ్చారు.  తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ఎమ్మెల్యే  తెలిపారు. జర్నలిస్టులంటే తనకు గౌరవం ఉందని, కబ్జాలతో తనకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు.