సుప్రీంకోర్టులో విజయ్ మాల్యాకు చుక్కెదురు

| Edited By: Pardhasaradhi Peri

Aug 31, 2020 | 6:33 PM

లిక్కర్ బేరన్ విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2017 నాటి కోర్టు ఉత్తర్వులను సమీక్షించవలసిందిగా కోరుతూ ఆయన దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది. తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను..

సుప్రీంకోర్టులో విజయ్ మాల్యాకు చుక్కెదురు
Follow us on

లిక్కర్ బేరన్ విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2017 నాటి కోర్టు ఉత్తర్వులను సమీక్షించవలసిందిగా కోరుతూ ఆయన దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది. తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదలాయించడంలో కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు పాల్పడినందుకు దోషిగా న్యాయస్థానం ఇదివరకే పేర్కొంది. అయితే దాన్ని సమీక్షించాలని మాల్యా రివ్యూ పిటిషన్ వేయగా..ఇందులో మెరిట్ లేదని, తాము కొట్టివేస్తున్నామని న్యాయమూర్తులు యూ.యూ.లలిత్, అశోక్ భూషణ్ లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఉభయ పక్షాల వాదనలను ఆలకించిన అనంతరం… కోర్టు రివ్యూ పిటిషన్ పై తీర్పును ఈ నెల 27 న రిజర్వ్ లో ఉంచింది.

అటు-న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘించి 40 మిలియన్ డాలర్లను మాల్యా తన పిల్లలకు బదలాయించారని, ఇందుకు ఆయన దోషి అని 2017 మే 9 న కోర్టు ప్రకటించింది. బ్రిటిష్ సంస్థ డియోజియో నుంచి అందుకున్న ఈ సొమ్మును విజయ్ మాల్యా తన పిల్లల పేరిట బదిలీ చేశారంటూ ఎస్ బీ ఐ నేతృత్వంలోని బ్బ్యాంకుల కన్సార్టియం 2017 లో కోర్టులో పిటిషన్ వేసింది. భారత్ లోని బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల శఠగోపం పెట్టి విజయ్ మాల్యా లండన్ చెక్కేశారు.