Satyadev New movie : మరో సినిమాను అనౌన్స్ చేసిన యంగ్ హీరో.. ఈ సారి ‘గాడ్సే’గా రానున్న సత్యదేవ్

విభిన్నమైన కథలతో సినిమాలు తీస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సత్యదేవ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టిన సత్యదేవ్ పూరిజగన్నాథ్ తెరకెక్కించిన జ్యోతి లక్ష్మి సినిమాతో హీరోగా మారాడు.

Satyadev New movie : మరో సినిమాను అనౌన్స్ చేసిన యంగ్ హీరో.. ఈ సారి గాడ్సేగా రానున్న సత్యదేవ్

Updated on: Jan 03, 2021 | 2:55 PM

Satyadev  : విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సత్యదేవ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టిన సత్యదేవ్ పూరిజగన్నాథ్ తెరకెక్కించిన ‘జ్యోతి లక్ష్మి’ సినిమాతో హీరోగా మారాడు. ‘బ్లఫ్ మాస్టర్’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాలతో విజయాలను అందుకున్న సత్యదేవ్ తాజాగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేసాడు. తనతో ‘బ్లఫ్‌ మాస్టర్‌’ సినిమా తెరకెక్కించిన గోపీ గణేష్‌ దర్శకత్వంలోనే మరో సినిమా చేస్తున్నాడు సత్యదేవ్. ఈ సినిమాకు ‘గాడ్సే’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధిన పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో సత్యదేవ్ లుక్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుందని తెలుస్తుంది. త్వరలోనే ‘గాడ్సే’ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

also read : Rakul In May Day: ‘మే డే’ సినిమా షూటింగ్‌లో రకూల్ బిజీ బిజీ.. తన ఫస్ట్ డే షూటింగ్ గురించి ఏం చెప్పిందంటే..