AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SARS-CoV-2: కరోనా వైరస్ బాధితులకు.. చైనా ప్రభుత్వం బంపర్ ఆఫర్..!

కోవిడ్‌-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అక్కడి ప్రభుత్వం విశ్వప్రయత్నాలు

SARS-CoV-2: కరోనా వైరస్ బాధితులకు.. చైనా ప్రభుత్వం బంపర్ ఆఫర్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 27, 2020 | 6:10 PM

Share

SARS-CoV-2: కోవిడ్‌-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అక్కడి ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో దీన్ని గుర్తించేందుకు లక్షలాది మంది అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. వేగంగా విస్తరిస్తోన్న కరోనాను ఆదిలోనే గుర్తించి కట్టడి చేయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

చైనాలో నిత్యం లక్షలాది మందితో రద్దీగా ఉండే నగరాలు, పట్టణాలన్నీ గతకొన్ని రోజులుగా నిర్మానుష్యంగా మారాయి. అయితే లక్షణాలున్న వారిని వీలైనంత తొందరగా గుర్తించి వైద్య పరీక్షలు చేయాలని.. ఇలా స్వచ్ఛందంగా వచ్చే వారికి నగదు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. వైరస్‌ లక్షణాలున్నట్లు అధికారులకు తెలియజేసినా కూడా నగదు అందజేసి ఉచిత వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వుహాన్‌ పరిసర ప్రాంతాల్లోని హాన్యాంగ్‌, హౌంగ్‌గవాంగ్‌తో పాటు చాలా పట్టణాలు 500నుంచి వెయ్యి యువాన్‌లను రివార్డుగా అందిస్తున్నారు.

కాగా.. ఈ జాబితాలోకి వుహాన్‌కు 150కి.మీ దూరంలో ఉన్న క్వైన్‌జియాంగ్ పట్టణం కూడా చేరింది. కరోనా లక్షణాలున్న వారు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని, ఇలా వచ్చిన వ్యక్తులకు వైరస్‌ ఉన్నట్లు రుజువైతే వారికి 10వేల యువాన్లు (దాదాపు లక్ష రూపాయలు)లను ఇస్తామని ప్రకటించింది. అయితే, ఇప్పటికే చికిత్స చేయించుకుంటున్న వారికి మాత్రం ఇది వర్తించదని తెలిపింది. అంతేకాదు, వైరస్‌ అనుమానిత వ్యక్తికి కూడా దాదాపు 2వేల యువాన్‌లు ఇస్తామని ప్రకటించింది.

Follow Us
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీట్ల సంఖ్యపై అమిత్ షా క్లారిటీ!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీట్ల సంఖ్యపై అమిత్ షా క్లారిటీ!
వాస్తు టిప్స్ : రాత్రి అంతా ఒత్తిడి, టెన్షన్‌తో నిద్రపోవడం లేదా?
వాస్తు టిప్స్ : రాత్రి అంతా ఒత్తిడి, టెన్షన్‌తో నిద్రపోవడం లేదా?
రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా?
రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా?
టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరిపోతది
టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరిపోతది
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం..
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం..
రోజా ఈజ్ బ్యాక్.. బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటి
రోజా ఈజ్ బ్యాక్.. బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటి
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. మ్యాచుకు రోహిత్ దూరం
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. మ్యాచుకు రోహిత్ దూరం
కార్పొరేట్ కోర్టులో క్రీడా జోష్.. TV9 బ్యాడ్మింటన్ మహాసంగ్రామం
కార్పొరేట్ కోర్టులో క్రీడా జోష్.. TV9 బ్యాడ్మింటన్ మహాసంగ్రామం
డిగ్రీ అర్హతతో LIC హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన
డిగ్రీ అర్హతతో LIC హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన
ఆసియాలో రెండో వాడు.. బాబర్ ఆజం చారిత్రాత్మక రికార్డు
ఆసియాలో రెండో వాడు.. బాబర్ ఆజం చారిత్రాత్మక రికార్డు