9 నెలల గర్భంతో ఎన్నికల బరిలోకి.. ఓటు వేసిన అనంతరం బిడ్డకు జననం.. ఆపై విజయం..
కృష్ణా జిల్లాలో రెండో విడుత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగిన 9 నెలల గర్భిణీ ...
కృష్ణా జిల్లాలో రెండో విడుత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగిన 9 నెలల గర్భిణీ పోలింగ్ రోజునే ఓటు వేసి మరీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన కృష్ణాజిల్లా కోరుకల్లులో చోటుచేసుకుంది. కలిదిండి మండలం కోరుకల్లు గ్రామంలో సర్పంచి స్థానం మహిళకు రిజర్వు కాగా బట్టు లీలాకనకదుర్గ అభ్యర్థిగా పోటీ చేసింది.
9నెలల గర్భంతో ఆమె ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంది. ఓటు వేసిన కాసేపటికే ఆమెకు నొప్పులు రాగా ఆమెను కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పండంటి ఆడపిల్లకు ఆమె జన్మనిచ్చింది. సర్పంచిగా పోటీచేసి ఓటు వేసిన రోజే బిడ్డ పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించింది. ఇక ఆడబిడ్డ ఆ ఇంటికి శుభాన్ని, విజయాన్ని తీసుకువచ్చింది. లీలా కనకదుర్గ 672 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి.. సర్పంచ్‌గా ఎన్నికైంది.
నిండు గర్భంతో ఉన్న తనకు ఊరి పెద్దలు, మిత్రులు, శ్రేయోభిలాషులు వెన్నంటి ఉండి తన విజయానికి కృషి చేశారని.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాని లీలా కనకదుర్గ చెప్పారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని, తన విజయానికి కృషి చేసిన అందరికీ రుణపడి ఉంటానని ఆమె తెలిపారు. తనకు సర్పంచ్ పదవీ దక్కటం తన బిడ్డ తెచ్చిన ఆదృష్టమేనని తల్లి మురిసిపోతుంది. రాజకీయాల్లోకి వస్తానని ఏమాత్రం ఊహించని తనకి.. ఏకంగా సర్పంచ్ పదవి రావటం ఆశ్చర్యంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటన తనకు లైఫ్ లాంగ్ గుర్తుండి పోతుందని లీలా కనకదుర్గ చెబుతోంది.
Also Read:
Kurnool Road Accident: కర్నూలు ప్రమాదంపై దిగ్భ్రాంతికర విషయాలు.. చిన్న పొరపాటుకు 14 మంది బలి..
జైల్లో ఉండి విజయం సాధించిన టీడీపీ మద్దతుదారుడు.. అనుచరులు అద్భుత వ్యూహంతో అదరగొట్టారు