టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్టార్‌డమ్ క్రియేట్ చేసుకుంది సమంత. సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్లకు పెళ్లి జరిగిందంటే.. కెరీర్‌కు పుల్‌స్టాప్ పడినట్టే. కానీ నాగ చైతన్యతో పెళ్లైన తరువాత కూడా సినిమాలను కంటిన్యూ చేస్తూ.. కెరీర్‌లో జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్లిపోతుంది. అంతేకాదు యంగ్ బ్యూటీలైన.. పూజా, రష్మికలు ఎంట్రీ ఇచ్చినా కూడా.. సమంత క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. తాజాగా ఓ పత్రిక నిర్వహిస్తున్న మోస్ట్ డిజైరబుల్ ఉమెన్స్ 2019 లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది సామ్. ఆయా రంగాల్లో రాణిస్తున్న 40 ఏళ్ల లోపు మహిళలపై ఆన్‌లైన్ సర్వే నిర్వహించగా సమంతకు మొదటిస్థానం దక్కింది.
ఈ సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. నిజానికి 30 ఏళ్ల తర్వాతనే మహిళలు అందంగా కనిపిస్తారని పేర్కొంది. అలాగే మహిళలు వైన్ లాంటి వారంది. కాగా.. 30 ఏళ్ల తరువాత మహిళలు ఎలా ఉంటారోనని భయపడొద్దు. ఎందుకంటే.. వయసు పెరిగే కొలదీ.. వారిలో ఆలోచనా శక్తి పెరుగుతుంది. దాంతో.. తమను తాము ఎంతో అందంగా చూపించేందుకు ప్రయత్నిస్తారని పేర్కొంది. కాగా.. సమంతతో పాటు మోస్ట్ డిజైరబుల్ ఉమెన్స్ 2019 లిస్ట్‌లో మరికొందరు స్థానం సంపాదించుకున్నారు. మరి వారెవరో.. మీరూ ఓ లుక్కేయండి.