భార్య‌కు బెయిల్..భ‌ర్త రిలీజ్..

తమిళనాడు సాలెం జిల్లా, ఎత్తాపుర్​కు చెందిన భార్య‌భ‌ర్త‌లు రంజిత్ కుమార్, పవిత్ర.. అదే గ్రామానికి చెందిన సదాశివం మ‌ర్డ‌ర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

భార్య‌కు బెయిల్..భ‌ర్త రిలీజ్..

Updated on: Jul 26, 2020 | 7:27 PM

తమిళనాడు సాలెం జిల్లా, ఎత్తాపుర్​కు చెందిన భార్య‌భ‌ర్త‌లు రంజిత్ కుమార్, పవిత్ర.. అదే గ్రామానికి చెందిన సదాశివం మ‌ర్డ‌ర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జులై 23న జరిగిన ఈ ఘటన జ‌ర‌గ్గా.. ఇద్దర్నీ సాలెం సెంట్రల్ జైల్లో రిమాండ్​కు తరలించారు పోలీసులు.

అదే రోజున మద్రాసు హైకోర్టులో పవిత్ర బెయిల్ పిటిషన్ వేయగా.. కోర్టు మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలు అందుకున్న అధికారులు.. పవిత్రను రిలీజ్ చేయాల్సింది పోయి..పొర‌పాటున‌ పవిత్ర భర్త రంజిత్​ను విడుదల చేశారు. ఉన్నత న్యాయ‌స్థానం బెయిల్ మంజూరు చేసినా.. పవిత్రను ఎందుకు రిలీజ్ చేయలేదని పవిత్ర బంధువులు అధికారులను ప్రశ్నించారు. అప్పుడు వాక‌బు చేయ‌గా తప్పు త‌మ‌వైపే ఉన్న‌ట్టు జైలు అధికారులు తెలుసుకున్నారు. వెంట‌నే ఎత్తాపుర్​కు చేరుకొని, రంజిత్​ను తిరిగి అరెస్ట్ చేసి జైలుకు త‌ర‌లించారు. అనంతరం సాలెం మహిళా జైలు నుంచి పవిత్రను రిలీజ్ చేశారు. దీనిపై విచార‌ణకు ఆదేశించిన జైలు సూప‌రెంటెండెంట్.. బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

 

ఇది కూడా చ‌ద‌వండి : కుమార్తెల‌తో కాడి మోయిస్తూ రైతు వ్య‌వ‌సాయం..చ‌లించిపోయిన సోనూసూద్..