అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్‌ను టీమ్ పరిశీలిస్తుండగా.. ఇటీవల విడుదల చేసిన నాగచైతన్య లుక్‌కు విశేష స్పందన లభించింది. పక్కా తెలంగాణ యాసలో మధ్య తరగతి యువకుడి పాత్రలో ఆయన కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే హీరోయిన్ సాయి పల్లవి లుక్‌ను సంక్రాంతి రోజున విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. దర్శకుడు శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రం ఇది కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. గతంలో ఆమె నటించిన ‘ఫిదా’ సినిమాలో ‘హైబ్రిడ్ పిల్ల’గా అలరించింది. ఇక ఇప్పుడు ఎలాంటి పాత్రలో కనిపించబోతోందో అన్న టెన్షన్ అభిమానుల్లో ఉంది.