సచిన్ రికార్డ్ బ్రేక్..అమ్మాయిలతో షేవింగ్..నెటిజన్ల ప్రశంసలు

లఖ్నో: ‘బార్బర్‌ షాప్ గర్ల్స్‌’  సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్లకి ఈ పేరు రీసెంట్ టైమ్స్‌లో బాగానే వినిపించి ఉంటుంది. దీనికి తోడు వీరికి జిల్లెట్‌ సంస్థ కూడా యాడ్ వీరితో యాడ్ తీసి ప్రచారం కల్పించింది. ఇప్పుడు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌  కూడా వీరికి అండగా నిలిచాడు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బన్వారీ తోలా అనే మారుమూల ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు నేహా, జ్యోతిలు సెలూన్‌ నిర్వహిస్తున్నారు. తమ తండ్రికి సహాయం చేయడానికి వీరు […]

సచిన్ రికార్డ్ బ్రేక్..అమ్మాయిలతో షేవింగ్..నెటిజన్ల ప్రశంసలు
Follow us
Ram Naramaneni

|

Updated on: May 04, 2019 | 1:47 PM

లఖ్నో: ‘బార్బర్‌ షాప్ గర్ల్స్‌’  సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్లకి ఈ పేరు రీసెంట్ టైమ్స్‌లో బాగానే వినిపించి ఉంటుంది. దీనికి తోడు వీరికి జిల్లెట్‌ సంస్థ కూడా యాడ్ వీరితో యాడ్ తీసి ప్రచారం కల్పించింది. ఇప్పుడు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌  కూడా వీరికి అండగా నిలిచాడు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బన్వారీ తోలా అనే మారుమూల ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు నేహా, జ్యోతిలు సెలూన్‌ నిర్వహిస్తున్నారు. తమ తండ్రికి సహాయం చేయడానికి వీరు తీసుకున్న నిర్ణయం సచిన్ మనసును టచ్ చేసింది.  ఈ విషయం తెలుసుకున్న మాస్టర్ బ్లాస్టర్ వారికి సాయంగా నిలవాలనుకున్నాడు. వారిని కలిసి షేవింగ్‌ చేయించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సచిన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

ఐదేళ్ల క్రితం యూపీలోని బన్వారీ తోలా ప్రాంతానికి చెందిన నేహా, జ్యోతి అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు..తమ తండ్రికి సాయం చేయడానికి షేవింగ్‌, కటింగ్‌ నేర్చుకున్నారు. తాత్కాలిక సాయం కోసం నేర్చుకున్న ఈ పని కాస్తా వారి జీవనాధారం అయింది. ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడానికి క్షవర వృత్తిలోకి దిగిన ఈ అక్కాచెల్లెళ్లు..ఓ వైపు చదువుకుంటూ మరోవైపు సెలూన్‌ నిర్వహించడం అలవాటుగా మార్చుకున్నారు.