రాఫెల్ రాకతో దేశ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ మ‌రింత బ‌లోపేతం

రాఫెల్ రాకతో దేశ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ మ‌రింత బ‌లోపేతం

క్రికెట్ దిగ్గ‌జం, మాస్ట‌ర్ బ్లాస‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ భార‌త వైమానిక ద‌ళాన్ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు. ర‌ఫేల్ యుద్ద విమానాల రాక‌తో భార‌తీయ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ మ‌రింత బ‌లోపేతంగా మారిందని తన ట్విట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు. దీనిలో భాగంగా రెండు రోజుల క్రితం ఫ్రాన్స్‌ నుంచి బయల్దేరిన అయిదు రఫేల్‌ యుద్ధ విమానాలు ఏడు వేల కి.మీ.లు ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. ఈ సంద‌ర్భంగా స‌చిన్ ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు.’ అత్యాధునిక […]

Sanjay Kasula

|

Jul 30, 2020 | 11:40 PM

క్రికెట్ దిగ్గ‌జం, మాస్ట‌ర్ బ్లాస‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ భార‌త వైమానిక ద‌ళాన్ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు. ర‌ఫేల్ యుద్ద విమానాల రాక‌తో భార‌తీయ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ మ‌రింత బ‌లోపేతంగా మారిందని తన ట్విట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు. దీనిలో భాగంగా రెండు రోజుల క్రితం ఫ్రాన్స్‌ నుంచి బయల్దేరిన అయిదు రఫేల్‌ యుద్ధ విమానాలు ఏడు వేల కి.మీ.లు ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి.

ఈ సంద‌ర్భంగా స‌చిన్ ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు.’ అత్యాధునిక ఫైటర్ జెట్ రాఫెల్ విమానాలకు చేర్చినందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఈ యుద్ధ విమానాల చేరిక‌తో మ‌న దేశ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ మ‌రింత బ‌లోపేతంగా త‌యారైంది. ర‌ఫేల్ విమానాల రాక‌తో ర‌క్ష‌ణ ద‌ళాల్లో న‌వీక‌ర‌ణ మొద‌లైంది. జైహింద్’ అంటూ ట్వీట్ చేశారు. స‌చిన్ ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్‌గా గౌరవ పదవిలో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu