ప్రవాస భారతీయురాలికి అమెరికా వైట్‌హౌస్‌లో కీలక బాధ్యత.. కమలా హ్యారిస్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా సబ్రీనా

ప్రవాస భారతీయురాలు మరొకరికి అమెరికా వైట్‌హౌస్‌లో కీలక బాధ్యత లభించింది. అమెరికా కొత్త వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌కు డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా సబ్రీనా సింగ్‌ నియమితులయ్యారు.

ప్రవాస భారతీయురాలికి అమెరికా వైట్‌హౌస్‌లో కీలక బాధ్యత.. కమలా హ్యారిస్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా సబ్రీనా

Updated on: Jan 10, 2021 | 9:31 PM

Sabrina Singh :  ప్రవాస భారతీయురాలు మరొకరికి అమెరికా వైట్‌హౌస్‌లో కీలక బాధ్యత లభించింది. అమెరికా కొత్త వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌కు డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా సబ్రీనా సింగ్‌ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను స్వేత సౌదం విడుదల చేసింది. బైడెన్, హ్యారిస్‌ ఎన్నికల ప్రచారంలోనూ కమలా హ్యారిస్‌ ప్రెస్‌ సెక్రటరీగా సబ్రీనా పనిచేశారు.

సబ్రీనా సింగ్‌తో పాటు వైట్‌హౌస్‌లో పనిచేసే పలువురు సభ్యుల నియామకాలను ప్రకటించారు. భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఈ ప్రతిభావంతులు అమెరికా ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణలో తమకు అండగా నిలబడి మరింత దృఢంగా ముందుకు వెళ్లేందుకు తీసుకెళ్తారు అని ప్రకటించారు. వీరి నియామకంపై కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న బైడెన్‌ ఓ కీలక ప్రకటన చేశారు. ప్రముఖ మల్టీ నేషనల్‌ కెమికల్‌ కంపెనీ ‘లిండెల్‌ బసెల్‌’ సీఈవో, ఛైర్మన్‌ అయిన ఇండియన్‌-అమెరికన్‌ భవేశ్‌ వి పటేల్‌‌ను ఫెడరల్‌ రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ డల్లాస్‌ తన హ్యూస్టన్‌ శాఖ బోర్డు డైరెక్టరుగా నియమించింది. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. గత ప్రభుత్వం కూడా చాలా మంది ప్రవాస భారతీయులకు కీలక పదవులను అప్పగించిన సంగతి తెలిసిందే..

ఇవి కూడా చదవండి :

Black Box Recorders : బ్లాక్‌బాక్సుల జాడ లభ్యం.. ఇండోనేసియా విమాన ప్రమాదంపై అధికారుల ఫోకస్..

Hawala Money : సాగర తీరంలో హవాలా అలలు.. ఇల్లీగల్ బిజినెస్‌పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల ఫోకస్