భక్తులకు గుడ్ న్యూస్.. అయ్యప్పస్వామి ప్రసాదం డోర్ డెలివరీ..

కరోనా వైరస్ మహమ్మారి నేపధ్యంలో ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు-టీడీబీ కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్పస్వామి ప్రసాదాన్ని భక్తులకు ఇంటివద్దకే పోస్ట్ ద్వారా..

  • Publish Date - 9:05 pm, Sat, 7 November 20
భక్తులకు గుడ్ న్యూస్.. అయ్యప్పస్వామి ప్రసాదం డోర్ డెలివరీ..

Sabarimala Temple: కరోనా వైరస్ మహమ్మారి నేపధ్యంలో ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు-టీడీబీ కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్పస్వామి ప్రసాదాన్ని భక్తులకు ఇంటివద్దకే పోస్ట్ ద్వారా అందిస్తామని ప్రకటించింది. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ఈ నెల 16వ తేదీ నుంచి శబరి సన్నిధానం తలుపులు తెరుచుకోనుండగా.. ఆరోజు నుంచే ప్రసాదం డోర్ డెలివరీ కూడా ప్రారంభమవుతుందని తెలిపింది. ప్రసాదం కోసం భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చునని సూచించింది. కేరళలోని ప్రాంతాలకు రెండు రోజుల్లో, ఇతర రాష్ట్రాలకు ఏడు రోజుల్లోగా అయ్యప్పస్వామి ప్రసాదాన్ని భక్తులకు చేరుస్తామని టీబీడీ చైర్మన్‌ పేర్కొన్నారు.

Also Read: 

జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి పోస్ట్ కోవిడ్ చికిత్స..

ఆ క్యాచ్ మిస్ కాకుంటే.. కథ వేరేలా ఉండేదిః కోహ్లీ