ఏపీలో కౌలు రైతులకు గుడ్ న్యూస్..మంత్రి ప్రకటన

|

Nov 19, 2019 | 9:46 AM

కౌలు రైతులకు ‘రైతు భరోసా’ పథకం కింద వచ్చే సొమ్మును అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. డిసెంబర్ 15 లోపు అర్హులైన కౌలు రైతుల వివరాలను సేకరించాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఏపీ మంత్రి కన్నబాబు ఇందుకు సంబంధించి వివరాలను మీడియాకు వివరించారు.  జాయింట్ ఫార్మింగ్ సంఘాలు.. ‘రైతు భరోసా’ స్కీమ్ పరిధిలోకి వస్తాయో, లేదో కూడా అధ్యయనం చేయనున్నట్లు కన్నబాబు తెలిపారు. కాగా ఇప్పటి వరకు 45 లక్షల కుటుంబాలు […]

ఏపీలో కౌలు రైతులకు గుడ్ న్యూస్..మంత్రి ప్రకటన
Follow us on

కౌలు రైతులకు ‘రైతు భరోసా’ పథకం కింద వచ్చే సొమ్మును అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. డిసెంబర్ 15 లోపు అర్హులైన కౌలు రైతుల వివరాలను సేకరించాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఏపీ మంత్రి కన్నబాబు ఇందుకు సంబంధించి వివరాలను మీడియాకు వివరించారు.  జాయింట్ ఫార్మింగ్ సంఘాలు.. ‘రైతు భరోసా’ స్కీమ్ పరిధిలోకి వస్తాయో, లేదో కూడా అధ్యయనం చేయనున్నట్లు కన్నబాబు తెలిపారు. కాగా ఇప్పటి వరకు 45 లక్షల కుటుంబాలు ‘రైతు భరోసా’ ద్వారా లబ్ది పొందాయని మంత్రి పేర్కొన్నారు.

ఇక ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘నాడు – నేడు’ కార్యక్రమం పరిధిని విస్తరించేందకు గవర్నమెంట్ సమాయత్తమవుతోంది. ఇప్పటికే పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఈ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టగా..త్వరలోనే మార్కెట్ యార్డులను కూడా ఇదే విధంగా అభివృద్ది పథంలోకి తీసుకురావాలని ఏపీ సర్కార్ వ్యూహాలు రచిస్తోంది. త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్ యార్డును ప్రవేశపెట్టబోతుంది. అంతేకాకుండా.. జనవరి 1 నుంచి అగ్రి ఇన్‌పుట్ దుకాణాలు ప్రారంభిస్తుంది ఏపీ ప్రభుత్వం.