రష్యా సుడాన్ డీల్… ఓడరేవు ఏర్పాటుకు ఒప్పందం… 25 ఏళ్ల పాటు అందించనున్న సేవలు…

అగ్రరాజ్యం రష్యా సుడాన్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. ఆ దేశంలో నావికా స్థావరం(ఓడ రేవు) ఏర్పాటుకు డీల్ కుదుర్చుకుంది.

రష్యా సుడాన్ డీల్... ఓడరేవు ఏర్పాటుకు ఒప్పందం... 25 ఏళ్ల పాటు అందించనున్న సేవలు...

Edited By:

Updated on: Dec 09, 2020 | 9:03 PM

Russia signs deal to set up naval base in Sudan for at least 25 yrs  ప్రపంచ దేశాల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా దేశాలు ఎప్పుడు పోటీ పడుతుంటాయి. వివిధ దేశాలకు అమెరికా, రష్యా ఆయుధాల సరఫరా, సైనిక సహాయాలు చేస్తుంటాయి. అంతేకాకుండా పలు దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు క‌ృషి చేస్తుంటాయి. లక్షల కోట్ల పెట్టుబడులను పెడతాయి. అయితే, అదంతా వాటి రాజ్య విస్తరణ కాంక్షకు మారిన రూపాలు మాత్రమే. ఈ క్రమంలోనే రష్యా తాజాగా ఓ ఒప్పందం చేసుకుంది. అదేంటంటే…

అగ్రరాజ్యం రష్యా సుడాన్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. ఆ దేశంలో నావికా స్థావరం(ఓడ రేవు) ఏర్పాటుకు డీల్ కుదుర్చుకుంది. రష్యా 25 ఏళ్ల పాటు సుడాన్‌కు ఓడ రేవు నిర్వహణ సేవలను అందించనుంది. రష్యా తన ప్రాబల్యాన్నిపెంచుకోవడంలో భాగంగా సుడాన్‌తో ఒప్పందం చేసుకుంది. అంతేకాకుండా రష్యా రానున్న రోజుల్లో సుడాన్ దేశానికి ఆయుధాలు, సైనికుల సేవలను కూడా అందించనుంది.