AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రుని 3డీ మ్యాప్ సిద్ధం చేస్తున్న రష్యా.. ఎందుకంటే?

ప్రపంచంలోని ప్రతిదేశం చంద్రునిపైకి తమ వ్యోమగాములను పంపాలని ఆరాటపడుతోంది. దీనికోసం రకరకాల పరిశోధనల జరుగుతున్నాయి. అయితే చంద్రుడిపైకి ఎలాగోలా రాకెట్ పంపిస్తే ఎక్కడ ల్యాండ్ చేయాలి?

చంద్రుని 3డీ మ్యాప్ సిద్ధం చేస్తున్న రష్యా.. ఎందుకంటే?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 23, 2020 | 10:12 PM

Share

ప్రపంచంలోని ప్రతిదేశం చంద్రునిపైకి తమ వ్యోమగాములను పంపాలని ఆరాటపడుతోంది. దీనికోసం రకరకాల పరిశోధనల జరుగుతున్నాయి. అయితే చంద్రుడిపైకి ఎలాగోలా రాకెట్ పంపిస్తే ఎక్కడ ల్యాండ్ చేయాలి? అనేది ఈ పరిశోధనల్లో ప్రతి దేశమూ ఎదుర్కొనే ముఖ్యమైన ప్రశ్న. అయితే ఈ సమస్యకు తాము పరిష్కారం చూపనున్నామని రష్యా ప్రకటించింది. దీనికోసం 3డీలో చందమామ మ్యాప్‌ను తయారు చేస్తున్నట్లు రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ డైరెక్టర్ అనాటలీ పెట్రుకోవిచ్ ప్రకటించారు.

మరోవైపు.. ఈ మ్యాప్‌ దాదాపు చంద్రుని ఉపరితలాన్ని పోలి ఉంటుందని తెలిపారు. అంటే 3డీలో మినీ చందమామను తయారుచేసేస్తున్నారన్నమాట. దీనివల్ల చంద్రుడిపై అంతరిక్ష నౌకలను ఎక్కడ ల్యాండ్ చేయాలో ఓ అంచనాకు రావొచ్చని ఆయన వెల్లడించారు. స్టీరియో ఇమేజింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు పెట్రుకోవిచ్ చెప్పారు. ఇటువంటి చంద్రుడి మ్యాప్ తయారుచేయడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. కాగా, వచ్చే ఏడాది అక్టోబరులో చంద్రుడిపైకి తమ అంతరిక్ష నౌకను పంపాలని రష్యా ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే.

Follow Us
NZ vs PAK: ఆ బలహీనతలే పాక్ కొంప ముంచనున్నాయా?
NZ vs PAK: ఆ బలహీనతలే పాక్ కొంప ముంచనున్నాయా?
ఫోన్‌ పట్టుకునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఫోన్‌ పట్టుకునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ వంటగదిలోని ఈ పదార్థం గుండెకు ఆల్కహాల్ కంటే డేంజర్..
మీ వంటగదిలోని ఈ పదార్థం గుండెకు ఆల్కహాల్ కంటే డేంజర్..
విజయ్ దేవరకొండ-రష్మికల పెళ్లి ! వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
విజయ్ దేవరకొండ-రష్మికల పెళ్లి ! వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
ఆదిమానవుల ఎగ్ కర్రీ.. నిప్పులపై ఇలా చేస్తే అదిరిపోతోంది
ఆదిమానవుల ఎగ్ కర్రీ.. నిప్పులపై ఇలా చేస్తే అదిరిపోతోంది
కాటేరమ్మ కొడుకు ఔట్.. బ్యాడ్ లక్కోడికి లక్కీ ఛాన్స్..?
కాటేరమ్మ కొడుకు ఔట్.. బ్యాడ్ లక్కోడికి లక్కీ ఛాన్స్..?
ఫైసా ఖర్చులే.. ఈ సీక్రెట్‌ ఫేస్‌ ప్యాక్‌తో అదిరిపోయే అందం మీసొంతం
ఫైసా ఖర్చులే.. ఈ సీక్రెట్‌ ఫేస్‌ ప్యాక్‌తో అదిరిపోయే అందం మీసొంతం
బంగారం ధరలు యూటర్న్‌! ఒక్కసారిగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్..
బంగారం ధరలు యూటర్న్‌! ఒక్కసారిగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్..
సూపర్ హిట్ సినిమా టికెట్ కేవలం రూ.11 మాత్రమే
సూపర్ హిట్ సినిమా టికెట్ కేవలం రూ.11 మాత్రమే
భార్య ప్రియాంక సంస్కృతిని గౌరవిస్తూ నిక్ జోనస్ కొత్త ట్రెండ్!
భార్య ప్రియాంక సంస్కృతిని గౌరవిస్తూ నిక్ జోనస్ కొత్త ట్రెండ్!