పాక్ పార్లమెంటులో గందరగోళం.. ఇమ్రాన్ ఖాన్ గైర్ హాజర్

జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్థాన్ పార్లమెంటులో మంగళవారం పెద్దఎత్తున రభస జరిగింది. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ప్రత్యేకంగా ఉభయసభల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే పార్లమెంటుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గైర్ హాజరయ్యారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. అసలు భారత ప్రభుత్వ నిర్ణయంపై చర్చకు సంబంధించిన ఎజెండా లేదంటూ కూడా విపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో ఉభయసభలూ వాయిదా పడ్డాయి. ‘ […]

పాక్ పార్లమెంటులో గందరగోళం.. ఇమ్రాన్ ఖాన్ గైర్ హాజర్

Edited By:

Updated on: Aug 06, 2019 | 10:03 PM

జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్థాన్ పార్లమెంటులో మంగళవారం పెద్దఎత్తున రభస జరిగింది. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ప్రత్యేకంగా ఉభయసభల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే పార్లమెంటుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గైర్ హాజరయ్యారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. అసలు భారత ప్రభుత్వ నిర్ణయంపై చర్చకు సంబంధించిన ఎజెండా లేదంటూ కూడా విపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో ఉభయసభలూ వాయిదా పడ్డాయి.
‘ ఆజాద్ కాశ్మీర్ లో భారత్ అదనంగా భారీ సంఖ్యలో బలగాలను మోహరించిందని, ఆక్రమిత కాశ్మీర్ లో ఆ దేశ సైనిక దళాలు క్లస్టర్ బాంబులను వినియోగిస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నాయని… ఇలాంటి పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని మొదట పార్లమెంటరీ వర్గాలు పేర్కొన్నట్టు ఓ వార్తా పత్రిక తెలిపింది. భారత ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షంగా ఉందని, ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానానికి విరుధ్దంగా ఉందని, ఇది జమ్మూ కాశ్మీర్, లేదా పాక్ ప్రజలకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పాక్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వ్యాఖ్యానించింది. అయితే ఇంత జరుగుతున్నా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఈ అత్యవసర పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకపోవడం విశేషం.