2019 రారాజు ఇతడే..22 ఏళ్ల రికార్డు బ్రేక్

ఇండియన్ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కెరీర్ పీక్ ఫామ్‌తో చెలరేగుతున్నాడు. రికార్డులను వన్ బై వన్ వరసబెట్టి తన ఖాతాలో వేసుకుంటున్నాడు. తాజాగా హిట్ మ్యాన్ 22 ఏళ్ల క్రితం రికార్డును బ్రేక్ చేశాడు. ఒక సంవత్సరంలో ఎక్కువ ఇంటర్నేషనల్ రన్స్ చేసిన ఓపెనర్‌గా సనత్‌ జయసూర్య పేరిట ఉన్న రికార్డును స్మాష్ చేశాడు. వెస్టిండీస్‌తో కటక్‌ వేదికగా జరుగుతోన్న మూడో వన్డేలో రోహిత్ ఈ అరుదైన ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ సదరు […]

2019 రారాజు ఇతడే..22 ఏళ్ల రికార్డు బ్రేక్

Updated on: Dec 22, 2019 | 9:09 PM

ఇండియన్ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కెరీర్ పీక్ ఫామ్‌తో చెలరేగుతున్నాడు. రికార్డులను వన్ బై వన్ వరసబెట్టి తన ఖాతాలో వేసుకుంటున్నాడు. తాజాగా హిట్ మ్యాన్ 22 ఏళ్ల క్రితం రికార్డును బ్రేక్ చేశాడు. ఒక సంవత్సరంలో ఎక్కువ ఇంటర్నేషనల్ రన్స్ చేసిన ఓపెనర్‌గా సనత్‌ జయసూర్య పేరిట ఉన్న రికార్డును స్మాష్ చేశాడు. వెస్టిండీస్‌తో కటక్‌ వేదికగా జరుగుతోన్న మూడో వన్డేలో రోహిత్ ఈ అరుదైన ఫీట్ సాధించాడు.

ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ సదరు రికార్డుకు 9 పరుగుల దూరంలో ఉన్నాడు.  నేటి మ్యాచ్‌లో 63 బంతులు ఆడిన రోహిత్ 63 రన్స్ చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో కనుక హిట్ మ్యాన్  ఆ 9 రన్స్ కొట్టకపోతే జయసూర్య రికార్డు చెక్కుచెదరకపోయేది.  ఎందుకంటే 2019లో భారత్ ఆడే చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇదే.  1991లో సంవత్సరంలో మొత్తం 2387 ఇంటర్నేషనల్ రన్స్ చేసిన జయసూర్య రికార్డు క్రియేట్ చేశాడు. అప్పట్నుంచి దీన్ని ఎవరూ బ్రేక్ చెయ్యలేకపోయారు. ఇక ప్రస్తుతం వీర ఫామ్‌లో ఉన్న రోహిత్ ఏడాది చివరి మ్యాచ్‌లో ఈ ఫీట్ అందుకోవడం యాదృచ్చంగా అనిపిస్తోంది.

.