నరసరావుపేట లో దారుణం.. భార్యను బ్యాట్ తో కొట్టి చంపిన భర్త

గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణం చోటుచేసుకుంది. భార్యను అతి దారుణంగా హత్యచేశాడు భర్త. హతుడు తరువాత పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. మృతురాలు నరసరావుపేట ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగా ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ముస్తఫా, ఉన్నీసాలకు పది సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. ముస్తఫా పని పాట లేకుండా జులాయిగా తిరుగుతూ భార్యను వేధింపులకు గురిచేస్తుండేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో నిన్న […]

  • Updated On - 9:03 pm, Sun, 22 December 19 Edited By:
నరసరావుపేట లో దారుణం.. భార్యను బ్యాట్ తో కొట్టి చంపిన భర్త


గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణం చోటుచేసుకుంది. భార్యను అతి దారుణంగా హత్యచేశాడు భర్త. హతుడు తరువాత పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. మృతురాలు నరసరావుపేట ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగా ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ముస్తఫా, ఉన్నీసాలకు పది సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. ముస్తఫా పని పాట లేకుండా జులాయిగా తిరుగుతూ భార్యను వేధింపులకు గురిచేస్తుండేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో నిన్న రాత్రి గొడవ జరగ్గా క్షణికావేశంలో భార్యను క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపినట్లు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది.